Raw Coconut: చలికాలంలో పచ్చికొబ్బరి తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..!
ABN, Publish Date - Jan 21 , 2024 | 04:41 PM
పచ్చికొబ్బరి చలికాలంలో తినడం చాలా మంచిదని చెబుతారు. దీని వల్ల కలిగే లాభాలివే..
పచ్చి కొబ్బెర సాధారణంగా దేవుడి పూజలలో కొబ్బరి కాయలు కొట్టనప్పుడు మాత్రమే ఇంట్లో వినిపియోగిస్తుంటాం. కానీ కేరళ ప్రజలు పచ్చి కొబ్బరిని చాలా విరివిగా వాడతారు. ముఖ్యంగా పచ్చికొబ్బరి చలికాలంలో తినడం చాలా మంచిదని చెబుతారు. పచ్చికొబ్బరి చలికాలంలో తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి? ఎందుకు తినాలి? పూర్తీగా తెలుసుకుంటే..
పోషకాలు..
పచ్చి కొబ్బరి లో కాపర్, సెలీనియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి అనేక ఖనిజాలు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి చాలా అవసరమైన పోషకాలు.
ఇది కూడా చదవండి: నెలరోజుల పాటూ మాంసాహారం తినడం మానేస్తే.. ఏం జరుగుతుందంటే..!
ప్రయోజాలు..
పచ్చి కొబ్బరిలో ఉండే ఫ్యాట్స్ శరీరానికి మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇందులో ఫోలేట్, విటమిన్ సి, థయామిన్ కూడా పరిమిత స్థాయిలో ఉంటాయి.
పచ్చి కొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఉదర సంబంధ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. పచ్చికొబ్బరిలో దాదాపు 61% ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు చాలా ముఖ్యం. జీర్ణాశయ సమస్యలను తగ్గించడం నుండి మలబద్దకం సమస్యను పరిష్కిరంచడం వరకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది.
పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. మధుమేహ రోగులకు ఇది ఒక వరం అని చెప్పడంలో సందేహం లేదు.
పచ్చి కొబ్బరిలో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు, చర్మానికి చాలా మేలు చేస్తాయి. విటమిన్ ఇ జుట్టుకు పోషణనిస్తుంది. ఇది జుట్టును బలపరుస్తుంది. చలికాలంలో ఎక్కువగా ఎదురయ్యే జుట్టు పొడిబారడం, విరిగిపోవడం వంటి సమస్య నుండి ఉపశమనం అందిస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 21 , 2024 | 04:41 PM