ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Turmeric: పచ్చి పసుపు కొమ్ములు..పసుపు పొడి..రెండింట్లో ఏది బెటర్ అనే డౌటొచ్చిందా? అయితే..

ABN, Publish Date - Feb 03 , 2024 | 07:13 PM

పసుపు కొమ్ములు బెటరా లేక పసుపు బెటరా అనే సందేహం వచ్చిన వాళ్లు తప్పక చదవాల్సిన కథనం ఇది.

ఇంటర్నెట్ డెస్క్: పసుపు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ఆయుర్వేదంలో స్పష్టంగా చెప్పారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా పసుపు నిరోధిస్తుందని ఆధునిక వైద్య శాస్త్రం కూడా రుజువు చేసింది. అయితే, ఆరోగ్యపరంగా పసుపు కొమ్ములు (Raw Turmeric) బెటరా లేక పసుపు పౌడర్ (Powdered Turmeric) బెటరా అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి డౌట్ మీకూ ఉంటే ఈ కథనాన్ని ఓసారి చదవండి.

ఎన్నో ఔషధ గుణాలున్న పసుపుతో ఇన్ఫెక్షన్లు, ఇన్‌ఫ్లమేషన్, క్యాన్సర్ వంటివి రావు. చర్మ సమస్యలు, జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు, నొప్పులు వంటి వాటిని కూడా పసుపు నివారిస్తుంది. పసుపులో ఉండే క్యూమనాయిడ్స్ అనే రసాయనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇక పసుపుకు ఈ రంగ రావడానికి కుకుర్మిన్ అనే రసాయనమే కారణం.


పసుపు కొమ్ములు బెటరా లేక పౌడర్ బెటరా?

  • పసుపు పౌడర్ మార్కెట్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అయితే, పచ్చి పసుపు కొమ్ములకు కూడా తనదైన ఔషధ గుణాలు ఉన్నాయి.

  • నిపుణులు చెప్పే దాని ప్రకారం, పసుపు కొమ్ముల్లో కుకుర్మిన్ అధికంగా ఉంటుంది. కాబట్టి, ఇవి మరింత మేలు చేకూరుస్తాయి.

  • పసుపు కొమ్ముల్లో ఉండే క్యూరోడిన్ అనే కాంపౌండ్‌కు ఫంగస్‌ను వేగంగా అడ్డుకునే శక్తి ఉంది.

  • అయితే, పసుపు పౌడర్‌కూ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పొడికి పచ్చి వాటికంటే యాంటీఆక్సిడెంట్ సామర్థ్యం ఎక్కువ. ముఖ్యంగా గాయాలు మానేలా చేసేందుకు పసుపు పొడి ఎంతో ఉపయుక్తం

  • ఇక టైప్ 2 డయాబెటిక్ పేషెంట్లకు పొడితోనే ఎక్కువ మేలు జరుగుతుంది. టీఎన్ఎఫ్, ఇంటర్‌ల్యూకిన్-6 వంటి ఇన్‌ఫ్లమేటరీ మార్కర్ల స్థాయిని ఇది తగ్గిస్తుంది.

మరి ఏది ఎంచుకోవాలి?

ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేకపోయినప్పటికీ క్యాన్సర్ వంటి వాటిని నిరోధించడంలో పసుపు కొమ్ముల సామర్థ్యం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. అయితే, వీటిని అతిగా వాడితే మాత్రం కడుపులో ఇబ్బంది, వాంతులు వంటివి రావచ్చు.

పసుపుతో ప్రయోజనాలు ఇవే..

పసుపును ఆహారంలో భాగంగా తీసుకుంటే ఊబకాయం, గుండె జబ్బులు, షుగర్ వ్యాధి, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వంటివి దరిచేరకుండా చూసుకోవచ్చు.

Updated Date - Feb 03 , 2024 | 07:22 PM

Advertising
Advertising