White Hair: తెల్లజుట్టు సమస్యకు చెక్ పెట్టే సూపర్ ఐడియా ఇది.. ఈ విత్తనాలతో హెయిర్ డై చేసుకుని వాడి చూడండి!
ABN, Publish Date - Feb 22 , 2024 | 10:53 AM
ఇంట్లోనే ఇలా హెయిర్ డై తయారుచేసుకుని ఉపయోగిస్తే తెల్లజుట్టు చాలా తొందరగా నల్లగా మారుతుంగి.
తెల్లజుట్టు ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య. చిన్న వయసులోనే తెల్లవెంట్రుకలు రావడంతో చాలామంది యువత వీటిని కవర్ చేయడానికి నానా తంటాలు పడుతుంటారు. అటు తెల్లజుట్టును అలాగే వదిలేయానూ లేరు, ఇటు రసాయనాలతో కూడిన హెయిర్ డైలు, షాంపూలు వాడలేరు. వీటన్నింటికి చెక్ పెట్టే మార్గం ఉంది. తెల్లజుట్టును నల్లగా మార్చడంలో కలోంజి విత్తనాలు అద్బుతంగా సహాయపడతాయి. వీటిని నల్ల జీలకర్ర అని కొందరు అంటారు. ఇవి నువ్వులను పోలిన గింజలు. ఈ కలోంజి విత్తనాలను ఉపయోగించి ఇంట్లోనే హెయిర్ డై తయారుచేసుకుని వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. కలోంజి విత్తనాలలో ఉండే గుణాలు, దీని హెయిర్ డై ఎలా తయారుచెయ్యాలి తెలుసుకుంటే..
కలోంజి విత్తనాలలో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని జుట్టుకు ఉపయోగిస్తే జుట్టు ఆరోగ్యంగా, నల్లగా నిగనిగలాడుతుంది. జుట్టు చిట్లడం, రాలడం తగ్గుతుంది.
ఇది కూడా చదవండి: రోజూ రాత్రి పడుకునేముందు గోరువెచ్చని పాలు తాగితే.. కలిగే లాభాలివే..!
హెయిర్ డై కి కావలసిన పదార్థాలు..
కలోంజి విత్తనాలు.. 1 కప్పు
కాఫీ పొడి 2 టీ స్పూన్లు
ఆవాలనూనె 2 టీ స్పూన్లు
తయారువిధానం..
ఇనుప బాండీని స్టౌ మీద పెట్టి అందులో కలోంజి విత్తనాలు వేసి సన్నిని మంట మీద బాగా వేయించాలి. ఈ విత్తనాలు వేగిన తరువాత వాటిని పక్కన పెట్టుకుని చల్లారిన తరువాత పొడి చేసుకోవాలి. ఈ విత్తనాల పొడిలో కాఫీ పొడి, ఆవాల నూనె వేసి బాగా మిక్స్ చెయ్యాలి. ఇదే కలోంజి విత్తనాల హెయిర్ డై. దీన్ని జుట్టుకు మూలాల నుండి బాగా పట్టించి మసాజ్ చెయ్యాలి. సుమారు 2 గంటల వరకు అలాగే ఉంచాలి. ఆ తరువాత గాఢత లేని షాంపూతో తల స్నానం చెయ్యాలి. దీనివల్ల క్రమంగా జుట్టు నల్లగా మారుతుంది. ఆరోగ్యంగా కూడా ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఇలా పొదుపు చేస్తే చాలు.. ఆడవాళ్లు ఆర్థికంగా బలపడతారు..!
ఈ కలోంజి విత్తనాల పొడిని ఇలా హెయిర్ డైలా మాత్రమే కాకుండా సాధారణంగా జుట్టుకు పెట్టుకునే హెన్నాలో కూడా మిక్స్ చేయవచ్చు. టీ డికాషన్ తో హెన్నా తయారుచేసుకుని అందులో కలోంజి విత్తనాల పొడి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి సుమారు 45నిమిషాల నుండి గంట వరకు అప్లై చెయ్యాలి. ఆ తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చెయ్యాలి.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 22 , 2024 | 10:57 AM