World Cancer Day: క్యాన్సర్ విషయంలో చాలామంది చేస్తున్న తప్పులివే.. ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే..!
ABN, Publish Date - Feb 04 , 2024 | 12:03 PM
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాలక్రమేణా మరణాల రేటు పెరుగుతున్న దృష్ట్యా క్యాన్సర్ నివారణకు జీవనశైలిలో ఈ 5 మార్పులు తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్య నిపుణులు చూస్తున్నారు. అవేంటో మీరూ తెలుసుకోండి.
సైలెంట్ కిల్లర్ గా పిలిచే జబ్బుల జాబితాలో క్యాన్సర్ ప్రధానమైనది. పరిస్థితి చెయ్యి దాటిపోయే వరకు క్యాన్సర్ జబ్బు చాలావరకు బయటపడదు. అయితే క్యాన్సర్ వస్తున్న కారణాలలో చాలావరకు మనుషుల అలవాట్లు, ఆహారమే ప్రధానంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే 30-50శాతం మందికి క్యాన్సర్ కేవలం అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా వస్తోంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాలక్రమేణా మరణాల రేటు పెరుగుతున్న దృష్ట్యా క్యాన్సర్ రాకూడదంటే జీవనశైలిలో ఈ 5 మార్పులు తప్పనిసరిగా చేయించుకోవాలని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..
ఆహారం..
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. ఆహారంలో మూడింట రెండువంతులు శాకాహారం ఉండాలి. ఆహారంలో ఎన్ని రంగుల కూరగాయలు, పండ్లు ఉంటే ఆరోగ్యం అంత బాగుంటుంది. ఫైటో కెమికల్స్, యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, పైబర్ సమృద్దిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఉప్పు, కారం, బేకింగ్ ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
ఇది కూడా చదవండి: బోర్లా పడుకునే అలవాటుందా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?
ఒత్తిడి..
నేటికాలంలో చాలామంది ఒత్తిడి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఒత్తిడి తీసుకునే ఆహారం మీద ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడిగా ఉన్నప్పుడు అధికంగా తినడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినాలని అనిపించడం, స్వీట్లు, ఉప్పు, కారం ఎక్కువ తినడం జరుగుతుంది. అదే విధంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యం కాదు. ఇది క్యాన్సర్ కు కారణమయ్యే అంశం.
నిద్ర..
మంచి నిద్ర ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. నాణ్యమైన నిద్ర శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, డిప్రెషన్ వంటి సమస్యలు జయించాలంటే 7గంటల నిద్ర తప్పనిసరి. నిద్ర గడియారం పనితీరు దెబ్బతింటే రొమ్ము, పెద్ద ప్రేగు, ప్రోస్టేట్, అండాశయ క్యాన్సర్ వంటి క్యాన్సర్ లు తొందరగా వస్తాయి.
ఇది కూడా చదవండి: Pressure Cooker: పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలను ప్రెషర్ కుక్కర్‌లో వండకండి!
శారీరక శ్రమ..
ప్రతిరోజూ అరగంట పాటూ క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గడానికి, శరీరంలో హార్మోన్లు ఉత్పత్తి ఆరోగ్యంగా ఉండటానికి, మెదడు పనితీరుకు సహకరించే ఎండార్ఫిన్ల విడుదలకు అనువుగా ఉంటుంది. పాజిటివ్ గా ఆలోచించడానికి, ఉల్లాసంగా ఉండటానికి ఇది తోడ్పడుతుంది.
మద్యపానం,ధూమపానం..
మద్యపానం, ధూమపానం వ్యసనంగా మారి క్యాన్సర్ బారిన పడేలా చేస్తాయి. ఆహారం నుండి నిద్ర, ఒత్తిడి, శారరీక శ్రమ వంటి ఎన్నో విషాలను కేవలం ధూమపానం, మద్యపానం ప్రభావితం చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.
ఇది కూడా చదవండి: హెయిర్ డై లు కాదు.. ఈ ప్యాక్ వేసుకుంటే తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 04 , 2024 | 12:10 PM