ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Wet Hair: తడిజుట్టుతోనే నిద్రపోతున్నారా? ఇలా అస్సలు చేయొద్దని నిపుణులు ఎందుకు చెబుతున్నారంటే..!

ABN, Publish Date - Mar 08 , 2024 | 09:06 PM

రాత్రిళ్లు తలస్నానం చేశాక అస్సలు జుట్టును ఆరబెట్టుకోకుండా అస్సలు నిద్రపోవద్దని నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: రోజంతా పనిచేసి ఇంటికొచ్చాక కొందరు బడలిక తీర్చుకునేందుకు స్నానం చేస్తారు. కొందరు ఏకంగా తలస్నానం చేసేందుకు ఇష్టపడతారు. ఈ క్రమంలో జుట్టును పూర్తిగా ఆరబెట్టుకోకుండానే నిద్రకు ఉపక్రమిస్తారు. అయితే, ఈ అలవాటు ఉన్న వాళ్లు వెంటనే పద్ధతి మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు (Health Tips). దీని వల్ల కేవలం జట్టు ఊడిపోవడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా చెబుతున్నారు (Avoid Sleeping at Night with Wet Hair).

Ultra Processed Food: ఈ ఆహారాలతో ఏకంగా 32వ్యాధులు వస్తాయా? అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ గురించి షాకింగ్ నిజాలివీ..!


తడిజుట్టుతో నిద్రకు ఉపక్రమిస్తే వచ్చే సమస్యలు

  • తడిజుట్టుతో నిద్రకు ఉపక్రమిస్తే నెత్తికి ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం పెరుగుతుంది

  • జుట్టు పెళుసుగా మారి తెగిపోతుంది. కుదుళ్లు బలహీనపడి జుట్టు ఊడిపోతుంది.

  • తడిజుట్టు కారణంగా దిండు కూడా తడిసిపోతుంది. ఈ చల్లదనం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కూడా రావచ్చు.

  • కాబట్టి, రాత్రి పడుకునేముందు జుట్టును బాగా ఆరబెట్టుకున్నాకే నిద్రకు ఉపక్రమించాలి.

ఇక జుట్టును కాపాడుకునేందుకు కొన్ని మార్గాలను కూడా నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జుట్టుకు నూనె రాసుకుంటే నీటిని పీల్చుకోవడం తగ్గుతుందని, ఫలితంగా వెంట్రుకలు త్వరగా ఊడిపోవని చెబుతున్నారు. హెయిర్ కండీషనర్ వాడటం వల్ల కూడా శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు. తలస్నానం తరువాత కచ్చితంగా కండీషనర్ రాయాలని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 08 , 2024 | 09:09 PM

Advertising
Advertising