ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: గాల్లో విమానం.. యాపిల్ వాచ్‌తో ప్యాసింజర్ ప్రాణాలు కాపాడిన డాక్టర్

ABN, Publish Date - Jan 23 , 2024 | 03:24 PM

యాపిల్ వాచ్ ఎంత ఖరీదైందో.. అంతే ఉపయోగకరమైన పనులను అది చేసి పెడుతోంది. అందులో ఉన్న కొన్ని అధునాతన ఫీచర్లు, మానవులను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేస్తున్నాయి. తాజాగా ఇదే యాపిల్ వాచ్‌ని వినియోగించి ఒక డాక్టర్ విమానంలో ఓ ప్యాసింజర్ ప్రాణాలను కాపాడాడు.

యాపిల్ వాచ్ ఎంత ఖరీదైందో.. అంతే ఉపయోగకరమైన పనులను అది చేసి పెడుతోంది. అందులో ఉన్న కొన్ని అధునాతన ఫీచర్లు, మానవులను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేస్తున్నాయి. తాజాగా ఇదే యాపిల్ వాచ్‌ని వినియోగించి ఒక డాక్టర్ విమానంలో ఓ ప్యాసింజర్ ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన ఇంగ్లండ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. జనవరి 9వ తేదీన బర్మింగ్‌హామ్ నుంచి ఇటలీలోని వెరోనాకు ర్యాన్ ఎయిర్ విమానం బయలుదేరింది. ఇందులో ప్రయాణిస్తున్న 70 ఏళ్ల బ్రిటీష్ మహిళకు ఒక్కసారిగా శ్వాసకోశ సమస్య ఎదురైంది. ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది.. ఆమెకు చికిత్స అత్యవసరమని భావించి, విమానంలో ఎవరైనా డాక్టర్ ఉన్నారా? అని కోరింది.


అప్పుడు ఆ విమానంలో ఉన్న నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) డాక్టర్ రషీద్ రియాజ్ సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆ మహిళను పరీక్షించిన తర్వాత, ఆమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు డాక్టర్ గుర్తించారు. ఆ సమయంలో పేషెంట్ ఆక్సిజన్ స్థాయిలను అంచనా వేసేందుకు గాను.. ఫ్లైట్ అటెండెంట్ వద్ద ఉన్న యాపిల్ వాచ్‌ని రియాజ్ అడిగి తీసుకున్నారు. ఆ వాచ్‌లో ఉండే ‘బ్లడ్ ఆక్సిజన్ ఫీచర్’ ఫీచర్ ద్వారా.. ఆమె శరీరంలోని ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్నట్టు రియాజ్ కనుగొన్నారు. విమానంలో ఆక్సిజన్ సిలిండర్ ఉంటే వెంటనే ఇవ్వాలని రియాజ్ కోరగా.. సిబ్బంది తీసుకొచ్చింది. ఈ విధంగా ఆక్సిజన్ అందించి.. ఇటలీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యేవరకు ఆ వృద్ధురాలి ప్రాణాలను రియాజ్ కాపాడగలిగారు. ఈ మొత్తం వ్యవహారంలో యాపిల్ వాచ్ అత్యంత కీలకంగా నిలిచిందని డాక్టర్ రియాజ్ చెప్పుకొచ్చారు.

తనకు యాపిల్ వాచ్ లాంటి పరికరాలు ఎలా వినియోగించాలో పెద్దగా అవగాహన లేదని, అయితే అత్యవసర పరిస్థితుల్లో ఈ గాడ్జెట్‌ని ఎలా ఉపయోగించాలో తనకు తెలిసిందని రియాజ్ పేర్కొన్నారు. ఒకరి ప్రాణాలను రక్షించేందుకు ఈ గాడ్జెట్స్‌ని ఏ విధంగా వినియోగించాలన్నది ఈ ఘటన ఒక గొప్ప పాఠంగా నిలిచిందని ఆయన తెలిపారు. అయితే.. ఈ బ్లడ్ ఆక్సిజన్ యాప్‌ని యాపిల్ సంస్థ రీసెంట్‌గానే తొలగించింది. మెడికల్ టెక్నాలజీ కంపెనీ ‘మాసిమో’తో పేటెంట్ వివాదం కారణంగా.. కొన్ని రోజుల క్రితమే సిరీస్ 9, అల్ట్రా 2 ఆపిల్ వాచ్‌ల నుండి ఆ యాప్‌ను తీసేసింది.

Updated Date - Jan 23 , 2024 | 03:24 PM

Advertising
Advertising