Donald Trump: ఆస్కార్ వేదిక సాక్షిగా.. డొనాల్డ్ ట్రంప్‌కు ఘోర అవమానం.. అసలేమైందంటే?
ABN, Publish Date - Mar 11 , 2024 | 03:53 PM
అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఆస్కార్ అవార్డుల (Oscars 2024) వేదికపై ఆయన నవ్వుల పాలయ్యారు. ఆస్కార్ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్‌ని (Jimmy Kimmel) ఉద్దేశించి తాను చేసిన పోస్టు కారణంగానే.. ట్రంప్ ఇలా అభాసుపాలయ్యారు. తనని విమర్శిస్తూ చేసిన ఆ పోస్టుపై జిమ్మీ తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడంతో.. ఆ వేడుకలో ట్రంప్ నవ్వులపాలవ్వాల్సి వచ్చింది.
అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఆస్కార్ అవార్డుల (Oscars 2024) వేదికపై ఆయన నవ్వుల పాలయ్యారు. ఆస్కార్ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్‌ని (Jimmy Kimmel) ఉద్దేశించి తాను చేసిన పోస్టు కారణంగానే.. ట్రంప్ ఇలా అభాసుపాలయ్యారు. తనని విమర్శిస్తూ చేసిన ఆ పోస్టుపై జిమ్మీ తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడంతో.. ఆ వేడుకలో ట్రంప్ నవ్వులపాలవ్వాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే..
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుండగానే.. డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’లో (Truth) ఒక సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఈ పోస్టులో ఆయన ఆస్కార్ హోస్ట్ జిమ్మీని విమర్శించారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో.. జిమ్మీ ఆ ఈవెంట్‌లోనే ట్రంప్‌పై తన ప్రతీకారం తీర్చుకున్నాడు. ఉత్తమ సినిమా అవార్డు ప్రకటించే సమయంలో ట్రంప్ పోస్టుపై జిమ్మీ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడే నా పనితీరుపై ఓ సమీక్ష అందింది. అదేమిటంటే.. ‘ఆస్కార్ వేడుకల్లో జిమ్మీని మించిన చెత్త హోస్ట్ ఎవరూ లేరు. సాధారణ స్థాయి కంటే తక్కువ వ్యక్తి అయిన జిమ్మీ.. తనకు సాధ్యంకాని దాన్ని పొందడం కోసం ఎంతో కష్టపడుతున్నట్లు అనిపిస్తోంది. అయితే అది ఎప్పటికీ జరగదు. ముందు అతడ్ని తొలగించి, ఎవరైనా చౌకబారు వ్యక్తిని తీసుకురండి. వీలైతే జార్జ్ స్లోపనోపౌలోస్‌ని జిమ్మీ స్థానంలో భర్తీ చేయండి. అతడు ఆస్కార్ వేదికను బలంగా, ఆకర్షణీయంగా మార్చగలడు’ అని ఆ సమీక్షలో రాసుకొచ్చారు’’ అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే.. డొనాల్డ్ ట్రంప్ పేరు ఎత్తకుండానే జిమ్మీ ఈ పోస్టుని ఆస్కార్ వేదికపై చదివాడు. దీనిని ట్రూత్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఏ మాజీ అధ్యక్షుడు రాశాడో మీరు ఊహించగలరని అతిథులతో పేర్కొన్నాడు. అనంతరం.. ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు ట్రంప్‌కి థ్యాంక్స్ చెప్పిన జిమ్మీ.. ‘‘మీ జైలు గడువు ఇంకా ముగియలేదా?’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో.. ఆ ఈవెంట్‌లో ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా నవ్వేశారు. కాగా.. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే నాలుగు క్రిమినల్ కేసులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఆ కేసుల్ని ఉద్దేశించే.. జిమ్మీ పైవిధంగా ఎగతాళి చేశాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 11 , 2024 | 03:53 PM