ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mohamed Muizzu: మరోసారి నోరుపారేసుకున్న ముయిజ్జు.. చివరికి సివిల్ దుస్తుల్లో కూడా..

ABN, Publish Date - Mar 05 , 2024 | 03:34 PM

మొదటి నుంచి భారత వ్యతిరేక వైఖరి కనబరుస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) మరోసారి భారతదేశంపై (India) నోరుపారేసుకున్నారు. మే 10వ తేదీ తర్వాత భారత సైన్యం (Indian Troops) మాల్దీవుల్లో ఉండరని, చివరికి సివిల్ దుస్తుల్లో కూడా తమ భూభాగంపై కనిపించరని అన్నారు. మాల్దీవులు, చైనా (Maldives-China) మధ్య సైనిక సహకారంపై (Free Military Aid) కీలక ఒప్పందం జరిగిన గంటల వ్యవధిలోనే ముయిజ్జు ఈ వ్యాఖ్యలు చేశారు.

మొదటి నుంచి భారత వ్యతిరేక వైఖరి కనబరుస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) మరోసారి భారతదేశంపై (India) నోరుపారేసుకున్నారు. మే 10వ తేదీ తర్వాత భారత సైన్యం (Indian Troops) మాల్దీవుల్లో ఉండరని, చివరికి సివిల్ దుస్తుల్లో కూడా తమ భూభాగంపై కనిపించరని అన్నారు. మాల్దీవులు, చైనా (Maldives-China) మధ్య సైనిక సహకారంపై (Free Military Aid) కీలక ఒప్పందం జరిగిన గంటల వ్యవధిలోనే ముయిజ్జు ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘మే 10వ తేదీ తర్వాత మన దేశంలో భారత సైనికులు ఉండరు. చివరికి సివిల్ దుస్తుల్లో కూడా కనిపించరు. భారత సైన్యం మన భూభాగంపై ఎలాంటి దుస్తుల్లోనూ కనిపించదు. నేను ఎంతో విశ్వాసంతో ఈ విషయం చెప్తున్నాను’’ అని ముయిజ్జు చెప్పారు. తన అటోల్ (Atoll) పర్యటనలో భాగంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యాన్ని తిరిగి వెనక్కు పంపించడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని, అయితే కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం సాధించిన ఈ విజయాన్ని వక్రీకరించేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని, తప్పుడు వార్తలను ఎవరూ నమ్మొద్దని ఆయన సూచించారు.


ఇదిలావుండగా.. మాల్దీవుల అధ్యక్షుడిగా ముయిజ్జు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే.. మాల్దీవుల్లో ఉన్న మూడు వైమానిక స్థావరాల్లో ఒకదాంట్లో విధులు నిర్వర్తిస్తోన్న భారత బలగాలు మార్చి 10లోగా, మిగతా రెండు స్థావరాల్లోని భద్రతా దళాలు మే 10నాటికి వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. దీనిపై ఫిబ్రవరి 2వ తేదీన సమావేశం జరిగింది. అయితే.. బలగాల స్థానంలో సాంకేతిక సిబ్బందిని (Technical Team) నియమిస్తామని భారత్ కండీషన్ పెట్టగా, అందుకు మాల్దీవులు అంగీకరించింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఇప్పటికే సాంకేతిక బృందం మాల్దీవులకు చేరుకుంది.

అయితే.. ఈ సాంకేతిక సిబ్బంది మిలిటరీ అధికారులేనని, వారిని పౌర దుస్తుల్లో తిరిగి మాల్దీవులకు పంపిస్తున్నారని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఇలాంటి అనుమానాలేమీ పెట్టుకోవద్దని, మే 10వ తేదీ తర్వాత భారత బలగాలు తమ భూభాగంపై ఉండవని పైవిధంగా ముయిజ్జు స్పష్టం చేశారు. మరోవైపు.. చైనా అనుకూలనేతగా పేరున్న ముయిజ్జు, ఊహించినట్లుగానే ఆ దేశానికి దగ్గరవుతున్నారు. ఇప్పటికే ఆ రెండు దేశాల మధ్య సైనిక సహకారంపై ఒప్పందం జరిగింది. అటు.. స్థానిక ప్రజలకు మానవతా సాయం, వైద్య సేవల కోసం శ్రీలంకతోనూ (Sri Lanka) ఒప్పందం చేసుకున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 05 , 2024 | 03:34 PM

Advertising
Advertising