ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ పెళ్లి..కానీ షాకింగ్ ట్విస్ట్!

ABN, Publish Date - Jan 12 , 2024 | 01:01 PM

OpenAI వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అతను ఓ అబ్బాయిని వివాహం చేసుకున్నాడు. ఇది తెలిసిన పలువురు ఆశ్చర్యానికి లోనయ్యారు.

OpenAI వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్(Sam Altman) పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అతను ఓ అబ్బాయిని వివాహం చేసుకున్నాడు. ఇది తెలిసిన పలువురు ఆశ్చర్యానికి లోనయ్యారు. తన స్నేహితుడు ఆలివర్ ముల్హెరిన్‌(Oliver Mulherin)ని సన్నిహితుల సమక్షంలో పెళ్లి(marriage) చేసుకున్నారు. ఈ వేడుక బుధవారం హవాయిలో జరిగింది. వివాహ సమయంలో, వారిద్దరూ తెల్లటి చొక్కాలు, లేత గోధుమరంగు ప్యాంటు, తెలుపు స్నీకర్స్ ధరించారు. ఈ సమయంలో లాటిస్ వ్యవస్థాపకుడు, సామ్ సోదరుడు జాక్ ఆల్ట్‌మన్ సహా పలువురు హాజరయ్యారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ చూడండి: Amazon: రేపే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్..ఇవే బెస్ట్ డీల్స్


ఈ క్రమంలో ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతున్నాయి. ఆ చిత్రాలలో సామ్ ఆల్ట్‌మన్, ఆలివర్ ముల్హెరిన్ ఒకరికొకరు ఉంగరాలు ధరించడం చూడవచ్చు. ఇక ఆల్ట్‌మాన్, ముల్హెరిన్ ఇద్దరూ కలిసి శాన్ ఫ్రాన్సిస్కోలోని రష్యన్ హిల్‌లో నివసిస్తున్నారు. ముల్హెరిన్ మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయంలో కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌లను అభ్యసించాడు. అతను గతంలో పలు రకాల AI ప్రాజెక్ట్‌లలో పనిచేశాడు. ముల్హెరిన్ కంటే ముందు ఆల్ట్‌మాన్ చివరిసారిగా నిక్ శివోతో డేటింగ్ చేశాడు. ఇద్దరూ తొమ్మిదేళ్లు సహజీవనం చేశారు. అయితే ఇద్దరూ కలిసి జియోలొకేషన్ సాఫ్ట్‌వేర్ అయిన లూప్ట్ అనే స్టార్టప్‌ను కూడా రూపొందించారు.

ఈ జంట వారి సంబంధాన్ని ఇన్ని రోజులుగా రహస్యంగా ఉంచారు. అయితే అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆలివర్ ముల్హెరిన్ ఒక ఆస్ట్రేలియన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అతను ఆగస్టు 2020 నుంచి నవంబర్ 2022 వరకు మెటా(meta)తో కూడా పనిచేశాడు. గత ఏడాది నవంబర్‌లో సామ్ ఆల్ట్‌మాన్ OpenAI నుంచి తొలగించబడ్డారు. ఆ తర్వాత మళ్లీ ఆల్ట్‌మాన్ చివరికి CEO పదవిని తిరిగి పొందారు.

Updated Date - Jan 12 , 2024 | 01:02 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising