ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వేళ.. పాలస్తీనా ప్రధాని రాజీనామా

ABN, Publish Date - Feb 26 , 2024 | 05:05 PM

ఇజ్రాయెల్, హమాస్ (Israel-Hamas War) మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ.. పాలస్తీనా ప్రధానమంత్రి మహమ్మద్‌ శతాయే (Mohammad Shtayyeh) ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పాలస్తీనా అధ్యక్షుడు మొహమూద్ అబ్బాస్‌కు (Mahmoud Abbas) సోమవారం అందజేశారు.

ఇజ్రాయెల్, హమాస్ (Israel-Hamas War) మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ.. పాలస్తీనా ప్రధానమంత్రి మహమ్మద్‌ శతాయే (Mohammad Shtayyeh) ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పాలస్తీనా అధ్యక్షుడు మొహమూద్ అబ్బాస్‌కు (Mahmoud Abbas) సోమవారం అందజేశారు. గాజాతో పాటు వెస్ట్‌ బ్యాంకులో హింస తీవ్రమవుతుండటంతో.. తాను ఈ నిర్ణయం తీసుకున్నానని శతాయే తెలిపారు. రాజీనామా అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘గాజాలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటు వెస్ట్‌బ్యాంక్‌, జెరూసలేంలలో హింసాత్మక ఘటనలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలోనే నేను ప్రధాని పదవికి ఈ నిర్ణయం తీసుకున్నాను. నా రాజీనామాను అధ్యక్షుడికి అందజేశాను’’ అని పేర్కొన్నారు.


ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తర్వాత తదుపరి దశ ఏంటో తనకు తెలుసని.. గాజాలో కొత్త రాజకీయ, ప్రభుత్వ ఏర్పాట్లు అవసరమని తాను భావిస్తున్నానని శతాయే పేర్కొన్నారు. ఈ యుద్ధం ముగిశాక.. పాలస్తీనా అథారిటీలో రాజకీయ ఏర్పాట్ల గురించి పాలస్తీనియన్లలో ఒక ఏకాభిప్రాయం ఏర్పడటానికి వీలుగా తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఇలా శతాయే ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో.. ఆయన స్థానంలో పాలస్తీనా ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌ ఛైర్మన్‌గా ఉన్న మహమ్మద్‌ ముస్తఫాను (Mohammad Mustafa) కొత్త ప్రధానమంత్రిగా నియమించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. కాగా.. యుద్ధం తర్వాత పాలస్తీనా రాజ్యాన్ని పరిపాలించ గల రాజకీయ నిర్మాణంపై పని ప్రారంభించాలని అధ్యక్షుడు అబ్బాస్‌పై అమెరికా ఒత్తిడి చేస్తున్న తరుణంలో శతాయే రాజీనామా చేయడం, ఆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Updated Date - Feb 26 , 2024 | 05:05 PM

Advertising
Advertising