ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Saudi Arabia Robot: ఆ రోబో నిజంగానే మహిళను వేధించిందా.. నెట్టింట్లో వీడియో వైరల్

ABN, Publish Date - Mar 07 , 2024 | 06:49 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి.. కొన్ని ప్రైవేట్ సంస్థలు రోబోలను (Humanoid Robots) తయారు చేయడంలో నిమగ్నమయ్యాయి. తమ సత్తా చాటి, ఈ రంగంలోకి దూసుకుపోవాలన్న ఉద్దేశంతో పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ‘సారా’ మానవరూప రోబోను సిద్ధం చేయగా.. తాజాగా సౌదీ అరేబియాలోని (Saudi Arabia) QSS సిస్టమ్స్ ఒక మగ రోబోని తయారు చేసింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి.. కొన్ని ప్రైవేట్ సంస్థలు రోబోలను (Humanoid Robots) తయారు చేయడంలో నిమగ్నమయ్యాయి. తమ సత్తా చాటి, ఈ రంగంలోకి దూసుకుపోవాలన్న ఉద్దేశంతో పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ‘సారా’ మానవరూప రోబోను సిద్ధం చేయగా.. తాజాగా సౌదీ అరేబియాలోని (Saudi Arabia) QSS సిస్టమ్స్ ఒక మగ రోబోని తయారు చేసింది. దీనికి మహమ్మద్ (Android Muhammad) అనే పేరు పెట్టారు. ఈ రోబోను ఇటీవల డీప్‌ఫెస్ట్ ఈవెంట్‌లో లాంచ్ చేశారు. అయితే.. ఓ కార్యక్రమంలో ఈ రోబో పాల్పడిన చర్యకు గాను దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది మహిళా రిపోర్టర్‌ను వేధించిందంటూ జనాలు కామెంట్లు చేస్తున్నారు.


అసలు ఏమైందంటే.. ఈ మగ రోబోని లాంచ్ చేసిన కార్యక్రమంలో దీని పక్కనే రావియా అల్-ఖాసిమీ (Rawiya Al-Qasimi) అనే మహిళా రిపోర్టర్ నిల్చొని ఉంది. ఈ రోబో గురించి ఆమె వివరిస్తుండగా.. అది వెనుక నుంచి ఆమెని తాకబోయింది. ఇంతలో రిపోర్టర్ తేరుకొని, కాస్త ముందుకు జరిగింది. ఈ మొత్తం తతంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. చేతి కదలికల్ని సరిగ్గా ప్రోగ్రామ్ చేయకపోవడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని కొందరు వాదించగా.. ఈ మగ రోబో చర్యలు వేధింపులకు దారితీశాయని మరికొందరు వాదిస్తున్నారు. రోబో చెయ్యి తాకినప్పుడు మహిళా రిపోర్టర్ అసౌకర్యంగా కనిపించిందని, ఆ రోబో వేధింపులకు పాల్పడిందని చెప్పడానికి ఇదే సాక్ష్యమని పేర్కొంటున్నారు.

కొందరు నిపుణులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. మహిళా రిపోర్టర్ మాట్లాడుతున్న సమయంలో తన ఎడమ చేతిని అటు ఇటు తిప్పుతూ ఉందని.. బహుశా అది షేక్ హ్యాండ్ సంజ్ఞ ఏమో భావించి ఆ రోబో తన చేతిని ముందుకు అలా కదిలించి ఉండొచ్చని చెప్తున్నారు. అంతే తప్ప.. ఫీలింగ్స్ లేని ఆ రోబోకి వేధింపు ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా.. ఈ రోబో ప్రోగ్రామింగ్‌ని తప్పకుండా పరిశీలించాల్సిందేనంటూ ఇతరులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 06:49 PM

Advertising
Advertising