ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vanavasa Rama : వనవాస రామా!

ABN, Publish Date - Jan 22 , 2024 | 05:00 AM

తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య.. తండ్రి మాటకై పదవిని వదిలి నార వస్త్రాలు ధరించి ధర్మపత్ని సీత, లక్ష్మణ సహితంగా అడవుల వైపు నడిచాడు. 14 ఏళ్ల వనవాసంలో లెక్కకుమిక్కిలి కష్టాలను అనుభవించాడు. భక్తకోటిని ఆదుకునే కోదండ రామయ్య పూలబాటను వదిలి ముళ్లబాట పట్టాడు.

14 ఏళ్ల సీతారామ లక్ష్మణుల అరణ్యవాసం

అయోధ్య నుంచి లంక దాకా ప్రస్థానం

తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య.. తండ్రి మాటకై పదవిని వదిలి నార వస్త్రాలు ధరించి ధర్మపత్ని సీత, లక్ష్మణ సహితంగా అడవుల వైపు నడిచాడు. 14 ఏళ్ల వనవాసంలో లెక్కకుమిక్కిలి కష్టాలను అనుభవించాడు. భక్తకోటిని ఆదుకునే కోదండ రామయ్య పూలబాటను వదిలి ముళ్లబాట పట్టాడు. అంతఃపురవాసాన్ని వదిలి పూరిపాకలో గడిపాడు. అడవుల్లో ఆకలి దప్పులకోర్చాడు. రాక్షసులతో తలపడ్డాడు. గొప్ప గొప్ప రుషి పుంగవులను కలిసి జ్ఞానసముపార్జన చేశాడు. ఈ ప్రస్థానం ద్వారా కష్టసుఖాలను ఒకే విధంగా స్వీకరించాలనే గొప్ప సందేశాన్ని భావితరాలకు ఇచ్చాడు. మరి.. రఘురాముడి ప్రస్థానం అయోధ్య నుంచి కానల వైపు ఎలా సాగింది? ఆ పురాణ పురుషుడి 14 ఏళ్ల వనవాసం ఎక్కడెక్కడ గడిచింది?

అయోధ్య నుంచి ప్రయాగ్‌రాజ్‌కు

అయోధ్య! ప్రస్తుతం యూపీలో ఉంది. పట్టాభి రాముడిగా వెలుగొందాల్సిన రామయ్య.. సీత, లక్ష్మణుడితో కలిసి అడవులవైపు బయలుదేరింది అయోధ్య నుంచే! ముగ్గురూ నేరుగా ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న భరద్వాజ ఆశ్రమానికి వెళ్లి.. ఆ మహర్షి ఆశీస్సులు తీసుకుంటారు. 14 ఏళ్ల సుదీర్ఘ వనవాసంలో భాగంగా ఎక్కడెక్కడ ఉండాలన్న విషయంలోనూ సలహాలు తీసుకుంటారు. రావణ సంహారం జరిగి..తిరిగి అయోఽధ్యకు వెళ్లేముందు కూడా సీతారామ లక్ష్మణులు ఆ మహర్షి ఆశీస్సులు తీసుకుంటారు.

చిత్రకూటం, మధ్యప్రదేశ్‌

శ్రీరామ వనవాసంలో కీలక ప్రదేశమిది. రాముడు ఇక్కడే కుటీరం ఏర్పాటు చేసుకొని సీత, లక్ష్మణుడితో కలిసి 11 ఏళ్లకుపైగా గడిపినట్లుగా రామాయణం చెబుతోంది. సప్తరుషుల్లో ఒకరైన అత్రి మహాముని, ఆయన సతీమణి అనసూయా దేవిని సీతారాములు ఇక్కడే కలిసి ఆశీస్సులు తీసుకుంటారు.

పంచవటి, నాసిక్‌

ప్రస్తుతం మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉంది. చిత్రకూటం నుంచి బయలుదేరిన సీతారామలక్ష్మణులు పంచవటిలోనూ కొన్నాళ్లున్నారు. రావణుడి సోదరి అయిన శూర్పణఖ రామ లక్ష్మణులను మోహించడం, లక్ష్మణుడు.. ఆమె ముక్కు, చెవులు కోసిన ఘట్టం అంతా ఇక్కడే జరిగినట్లు రామాయణ గాథ చెబుతుంది. సీతను రావణుడు అపహరించిందీ ఇక్కడే.

లేపాక్షి, ఆంధ్రప్రదేశ్‌

ప్రస్తుతం ఏపీలోని అనంతపురం జిల్లాలో ఉన్న ప్రదేశమిది. పుష్పక విమానంలో సీతను రావణుడు తీసుకెళుతున్పప్పుడు పక్షిరాజు జటాయువు జానకీమాతను రక్షించేందుకు లంకేశుడితో పోరాడింది ఇక్కడే. లక్ష్మణుడితో కలిసి పంచవటి నుంచి సీతను వెతుక్కుంటూ బయలుదేరిన శ్రీరామచంద్రుడు ఓ చోట రెక్కలు తెగి.. దేహమంతా రక్తసిక్తమై పడివున్న స్థితిలో జటాయువును చూస్తాడు. పక్షిరాజును ఉద్దేశించి ‘లే పక్షి’ అని రాముడు అన్నాడని.. అందుకే ఆ ప్రదేశానికి లేపాక్షి అనే పేరొచ్చిందని పురాణ కథనం. జటాయువు ప్రాణం వీడుతూ సీతను రావణుడు అపహరించాడని రామలక్ష్మణులకు వివరిస్తాడు.

కిష్కింధ, కర్ణాటక

కిష్కింధను ఇప్పుడు హంపిగా పిలుస్తున్నారు. వానరరాజు సుగ్రీవుడిని రాముడు కలిసిన చోటు ఇది. సుగ్రీవుడితో స్నేహం.. ఆయన సోదరుడు వాలి సంహారం.. సీతాన్వేషణకు హనుమంతుడిని పంపడం... రావణుడితో యుద్ధం కోసం వానర సైన్యంతో కదలడం వంటి కీలక ఘట్టాలకు కిష్కింధే నెలవు.

రామేశ్వరం తమిళనాడు

రామయణంలో పొందుపర్చిన అన్ని ప్రదేశాల్లోకెల్లా అత్యంత ప్రముఖమైన ప్రదేశం రామేశ్వరం. వానర సైన్యంతో కలిసి సముద్రం దాటి లంకకు వెళ్లేందుకు రాముడు వారధిని నిర్మించింది ఇక్కడి నుంచే. రాముడు సైకత లింగాన్ని తయారు చేసి పూజలు చేశాడని రామాయణంలో ప్రత్యేక ప్రస్తావనా ఉంది.

అశోక వాటిక, శ్రీలంక

శ్రీలంకలో ఉన్న దర్శనీయ స్థలాల్లో అశోక వాటిక ప్రఖ్యాతిపొందింది. శ్రీలంకలోని నువారా ఎలియా అనే ప్రాంతంలో ఉంది. అశోక వాటికను ‘సీతా అమ్మన్‌ టెంపుల్‌’గా పిలుస్తున్నారు. సీతను రావణుడు ఉంచింది ఇక్కడే. సీతమ్మ జాడ తెలుసుకునేందుకు లంకలో అడుగుపెట్టిన హనుమంతుడి పాదముద్రలూ ఇక్కడ చూడొచ్చు.

తలైమన్నార్‌, శ్రీలంక

రామ-రావణ యుద్ధం జరిగిన చోటు.. ఆ సంగ్రామంలో రావణుడు నేలకొరిగిన చోటు.. అశోకవనం నుంచి వచ్చిన సీత మళ్లీ రాముడి చెంతకు చేరిన చోటు ఇది. తలైమన్నార్‌లోనే రావణుడి సోదరుడైన విభీషణుడిని లంకకు రాజుగా ప్రకటించిన అనంతరం ఇక్కడి నుంచే సీతారామలక్ష్మణులు బయలుదేరి అయోధ్యలో అడుగుపెడతారు.

Updated Date - Jan 22 , 2024 | 05:00 AM

Advertising
Advertising