Lucknow Jail: లక్నో జైలులో ఊహించని పరిణామం.. 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్
ABN, Publish Date - Feb 05 , 2024 | 05:46 PM
సాధారణంగా.. జైలులో ఉన్న ఖైదీలకు బయటి వ్యక్తులతో ఎలాంటి సంప్రదింపులు ఉండవు. ఫోన్‌లో మాట్లాడటం, అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు పలకరించడానికి జైలుకు రావడం తప్పితే.. అంతకుమించి బయటి ప్రపంచంతో వారికి కనెక్టివిటీ అనేది ఉండదు. అంత కట్టుదిట్టమైన జాగ్రత్తలు ఉన్నప్పటికీ.. లక్నో జైలులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
సాధారణంగా.. జైలులో ఉన్న ఖైదీలకు బయటి వ్యక్తులతో ఎలాంటి సంప్రదింపులు ఉండవు. ఫోన్‌లో మాట్లాడటం, అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు పలకరించడానికి జైలుకు రావడం తప్పితే.. అంతకుమించి బయటి ప్రపంచంతో వారికి కనెక్టివిటీ అనేది ఉండదు. అంత కట్టుదిట్టమైన జాగ్రత్తలు ఉన్నప్పటికీ.. లక్నో జైలులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ జైల్లో ఉన్న ఖైదీల్లో 63 మందికి హెచ్‌ఐవీ సోకినట్లు వెల్లడైంది. అందునా.. గతేడాదిలో ఒక్క డిసెంబర్ నెలలో మాత్రమే 36 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. దీంతో.. జైలు అధికారులు అప్రమత్తం అయ్యారు.
తాము తరచూ పరీక్షలు నిర్వహిస్తుంటామని, కానీ సెప్టెంబర్ నుంచి హెచ్‌ఐవీ టెస్టింగ్ కిట్‌లు అందుబాటులో లేవని, ఆ కారణం చేతనే డిసెంబర్ వరకూ పరీక్షలు నిర్వహించడానికి వీలు పడలేదని జైలు అధికారులు వెల్లడించారు. సోకిన ఖైదీల్లో ఎక్కువ మంది డ్రగ్ అడిక్షణ్ చరిత్ర కలిగిన వ్యక్తులే ఉన్నారని వివరణ ఇచ్చారు. జైలు ప్రాంగణం వెలుపల కలుషితమైన సిరంజీలను ఉపయోగించడం వల్లే ఈ ఖైదీలు వైరస్‌కు గురయ్యారని తెలిపారు. జైలులోకి ప్రవేశించిన తర్వాత ఏ ఒక్క ఖైదీకి కూడా హెచ్‌ఐవీ సోకలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ పరిస్థితిని పరిష్కరించేందుకు గాను HIV-పాజిటివ్ ఖైదీలకు లక్నోలోని ఆసుపత్రిలో సాధారణ చికిత్స అందిస్తున్నారు. హెచ్ఐవీ సోకిన ఖైదీల ఆరోగ్యానికి నిశితంగా పరిశీలిస్తున్నారు.
హెచ్ఐవీ సోకిన ఖైదీల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ.. గత ఐదేళ్లలో హెచ్‌ఐవీ సంక్రమణ కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదని జైలు అధికారులు స్పష్టం చేశారు. ఈ భయంకరమైన వ్యాధి బారిన పడిన ఖైదీల శ్రేయస్సు, వైరస్ నియంత్రణ కోసం తాము కసరత్తులు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు.. ఈ హెచ్ఐవీ మూలంగా క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని అధికారులు నిర్ణయించారు. అలాగే.. ఈ వైరస్ ఖైదీల్లో మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ప్రస్తుత ఆరోగ్య ప్రోటోకాల్స్‌ని సమీక్షిస్తున్నారు.
Updated Date - Feb 05 , 2024 | 05:46 PM