ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ram Mandir: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన.. ఇది జాతీయ పండుగనా లేక బీజేపీ-ఆర్ఎస్ఎస్‌ల ఈవెంటా?

ABN, Publish Date - Jan 21 , 2024 | 10:32 PM

అయోధ్యలోని రామమందిరంలో సోమవారం మధ్యాహ్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోయే రామ్‌లల్లా ప్రతిష్ఠాపన విశేషాలను పక్కనపెడితే.. దీనిపై కొంతకాలం నుంచి దేశవ్యాప్తంగా తారాస్థాయిలో రాజకీయ వివాదం నడుస్తోంది. ఈ ప్రాణప్రతిష్ఠను బీజేపీ జాతీయ పండుగగా అభివర్ణిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం దీనిని బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఈవెంట్‌గా పిలుస్తున్నాయి.

అయోధ్యలోని రామమందిరంలో సోమవారం మధ్యాహ్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోయే రామ్‌లల్లా ప్రతిష్ఠాపన విశేషాలను పక్కనపెడితే.. దీనిపై కొంతకాలం నుంచి దేశవ్యాప్తంగా తారాస్థాయిలో రాజకీయ వివాదం నడుస్తోంది. ఈ ప్రాణప్రతిష్ఠను బీజేపీ జాతీయ పండుగగా అభివర్ణిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం దీనిని బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఈవెంట్‌గా పిలుస్తున్నాయి. రామమందిర నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకముందే.. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహిస్తోందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో శ్రీరాముడిని వినియోగించుకోవడం కోసమే.. ఆ పార్టీ ఈ హడావుడి చేస్తోందని ప్రతిపక్ష నేతలు కామెంట్లు చేస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే.. C-VOTER ABP న్యూస్ ఒక సర్వే నిర్వహించింది. ఈ ప్రాణప్రతిష్ఠపై నడుస్తున్న రాజకీయ వివాదం మీద సాధారణ ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకోవడం కోసం ఈ సర్వే చేపట్టింది. ఇందులో.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే ఫలితాలు నమోదయ్యాయి. 43 శాతం మంది ఈ ప్రాణప్రతిష్ఠను జాతీయ వేడుకగా పేర్కొనగా.. 27 శాతం మంది ఇది సనాతన ధర్మానికి చెందిన ఆచారమని అభిప్రాయపడ్డారు. 23 శాతం మంది మాత్రం దీనిని బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఈవెంట్‌గా పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ ఇంత హడావుడి చేస్తోందని వాళ్లు తమ ఒపీనియన్ తెలిపారు. అయితే.. 7 శాతం మంది ప్రజలు దీనిపై స్పందించలేదు. జనవరి 19-20 తేదీల్లో నిర్వహించిన ఈ సర్వేలో భాగంగా.. మొత్తం 1,573 మంది నుంచి అభిప్రాయాల్ని తీసుకున్నారు.

ఇదిలావుండగా.. ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 08 సెకన్ల నుండి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు.. అంటే 84 సెకన్లు మాత్రమే ఈ ప్రతిష్ఠాపనకు శుభసమయం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రారంభోత్సవానికి హాజరై.. మధ్యాహ్నం 12:15 గంటలకు రామాలయం గర్భగుడిలో పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి రాజకీయ నేతలతో పాటు సినీ తారలు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిశాక.. అయోధ్యలో ‘రామజ్యోతి’ వెలిగించి దీపావళి తరహాలో ఘనంగా వేడుకలను నిర్వహించనున్నారు.

Updated Date - Jan 21 , 2024 | 10:32 PM

Advertising
Advertising