ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodya: రాముడిపై పాడిన ఆ పాట మీరు విన్నారా.. మోదీ ప్రశంసించిన ఈ సింగర్ ఎవరు..

ABN, Publish Date - Jan 06 , 2024 | 12:57 PM

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి(Ayodya Ram Mandir) ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. దేశమంతా రామనామస్మరణతో మార్మోగుతోంది. జనవరి 22న ఆలయంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ప్రధాని మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది.

అయోధ్య: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి(Ayodya Ram Mandir) ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. దేశమంతా రామనామస్మరణతో మార్మోగుతోంది. జనవరి 22న ఆలయంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ప్రధాని మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. దేశ ప్రజలు ఆ మహత్తర క్షణం కోసం ఎదురు చూస్తున్న వేళ ప్రధాని మోదీ(PM Modi) ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. అందులో ఆయన ఓ యూట్యూబర్ రాముడిపై పాడిన పాటను ప్రస్తావించారు.

స్వస్తి మెహుల్ అనే సింగర్ ఆలపించిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని మోదీ కూడా చూసి ఎక్స్ పోస్ట్ లో "రాముడిపై స్వస్తీజీ పాడిన పాట చాలాసేపు చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. కళ్లను కన్నీళ్లతో మనస్సును భావోద్వేగాలతో నింపుతుంది" అని రాశారు. సాంగ్ కి సంబంధించిన యూట్యూబ్ లింక్ ను ఎక్స్ లో షేర్ చేశారు. దీన్ని షేర్ చేసిన గంటలో వీడియోకి 3 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి.

"సాంగ్ వినడానికి ఈ లింక్ క్లిక్ చేయండి"


వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి 22న రామ్ లల్లాకు పట్టాభిషేకం చేసే ప్రధాన ఆచారాలను నిర్వహిస్తారు. జనవరి 14 నుండి జనవరి 22 వరకు అయోధ్యలో అమృత్ మహౌత్సవ కార్యక్రమం ఉంటుంది.

మహాయజ్ఞం కార్యక్రమం కూడా ఉంటుంది. యజ్ఞం అనంతరం భక్తులకు అన్నదానం చేస్తారు. మహా సంప్రోక్షణ కోసం అయోధ్యకు చేరుకునే వేలాది మంది రామ భక్తులకు వసతి కల్పించడానికి తాత్కాలిక డేరాలు నిర్మిస్తున్నారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. 10 నుంచి 15 వేల మందికి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Jan 06 , 2024 | 12:57 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising