ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అత్యద్భుతం... రామయ్య విగ్రహం!

ABN, Publish Date - Jan 21 , 2024 | 04:42 AM

ఒక పాదం వద్ద స్వామి హనుమ.. మరో పాదం వద్ద గరుత్మంతుడు. విగ్రహం చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలు, సనాతన ధర్మానికి సంబంధించిన చిహ్నాలు... అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించిన బాల రాముడి విగ్రహంలో ఇవన్ని కొలువుదీరాయి. ఇప్పటి వరకూ రూపొందిన రాముడి విగ్రహాల్లో..

స్వామివారి చుట్టూ దశావతార రూపాలు

అయోధ్య, జనవరి 20: ఒక పాదం వద్ద స్వామి హనుమ.. మరో పాదం వద్ద గరుత్మంతుడు. విగ్రహం చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలు, సనాతన ధర్మానికి సంబంధించిన చిహ్నాలు... అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించిన బాల రాముడి విగ్రహంలో ఇవన్ని కొలువుదీరాయి. ఇప్పటి వరకూ రూపొందిన రాముడి విగ్రహాల్లో ఇదే అత్యంత విపులంగా ఉన్నదిగా భావిస్తున్నారు. గర్భగుడిలో సింహాసనంపై ప్రతిష్ఠించిన విగ్రహానికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే వైరల్‌గా మారాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తే.. రాముడి విగ్రహానికి ఇరువైపులా శ్రీహరి దశావతారాలు చెక్కినట్లు కనబడుతోంది. నరసింహ, కృష్ణ, పరశురామ, కల్కి తదితర అవతారాల వర్ణనలు విగ్రహంపై ఉన్నాయి. రామభక్తుల్లో అగ్రగణ్యుడైన హనుమంతుడు స్వామివారి కుడి పాదం వద్ద, విష్ణువు వాహనమైన వైనతేయుడు ఎడమ పాదం వద్ద కొలువుదీరారు. విగ్రహం పై భాగంలో సనాతన ధర్మం, హిందూ మతానికి చెందిన పవిత్ర చిహ్నాలు స్వస్తిక్‌, ఓంకారం, చక్రం, గద, శంఖాలను చిత్రీకరించారు. అలాగే సూర్య వంశీయుడైన రామయ్య తల చుట్టూ దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్య భగవానుడిని ఏర్పాటు చేశారు. ఈ చిహ్నాలన్నీ రాముడు, విష్ణుమూర్తితో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నవే. అలాగే బాల రాముడి కుడి చేయి అభయ ముద్రలో బాణాన్ని పట్టుకొని ఉండగా, ఎడమ చేతిలో ధనస్సు ఉంది. ఇదిలా ఉండగా, కాశీకి చెందిన లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ నేతృత్వంలోని అర్చకుల బృందం ఆలయ ప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులను నిర్వహిస్తోంది. మోదీకి బదులు ట్రస్టు సభ్యుడు డాక్టర్‌ అనిల్‌ మిశ్రా దంపతులు పూజల్లో పాల్గొంటున్నారు. 22న ప్రాణప్రతిష్ఠలో భాగంగా బాల రాముడి విగ్రహం కళ్లకు ఉన్న గంతలను ప్రధాని విప్పనున్నారు. ఆ తర్వాత మోదీ స్వామివారిని దర్శించుకొని హారతి ఇస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి. కృష్ణశిలపై ఐదేళ్ల బాలుడి రూపంలో, పద్మపీఠంపై నిలబడిన భంగిమలో దివ్యత్వం ఉట్టిపడుతున్న 51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ చెక్కారు.

దర్యాప్తు జరపాల్సిందే!

అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగక ముందే కళ్లు తెరిచి చూస్తున్న ఫొటోలు బయటకు రావడంపై శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం కళ్లపై వస్త్రం లేకుండా ఫొటోలు తీయడమే కాకుండా వైరల్‌ చేయడం సమంజసం కాదన్నారు. ప్రధాని చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరిగే వరకు బాల రాముడి కళ్లు ప్రజలకు కనబడకుండా మొత్తం విగ్రహాన్ని వస్త్రంతో చుట్టి ఉంచారు. దాన్నెవరో తొలగించి ఫొటోలు తీశారు. ఈ పని ఎవరు చేశారో తేల్చేందుకు దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఫొటోలను బట్టి చూస్తుంటే గర్భ గుడిలోనే తీసినట్లుగా తెలుస్తోందన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని తులసీనగర్‌కు చెందిన గుర్రం దయాకర్‌ 16 వేలకు పైగా బియ్యపు గింజలు ఉపయోగించి, 60 గంటల పాటు కష్టపడి అయోధ్య రామ మందిర నమూనాను తయారు చేశాడు.

- జగిత్యాల టౌన్‌

Updated Date - Jan 21 , 2024 | 04:42 AM

Advertising
Advertising