ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kota: ఈ విద్యార్థులకేమైంది.. కోటాలో నీట్ అభ్యర్థి ఆత్మహత్య

ABN, Publish Date - Jan 24 , 2024 | 11:34 AM

అది విద్యార్థులకు ఉన్నత స్థాయి ప్రమాణాలతో శిక్షణనిచ్చే ప్రదేశం. కానీ పలు కారణాలతో దశాబ్దం నుంచి వార్తల్లో నిలుస్తోంది. రాజస్థాన్‌లోని కోటా(Kota) గురించే ఈ వార్త. తాజాగా అక్కడ కోచింగ్ తీసుకుంటున్న మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో 2024లో కోటా(Kota)లో ఆత్మహత్య చేసుకున్న తొలి విద్యార్థిగా వార్తల్లోకెక్కాడు. కో

జైపుర్: అది విద్యార్థులకు ఉన్నత స్థాయి ప్రమాణాలతో శిక్షణనిచ్చే ప్రదేశం. కానీ పలు కారణాలతో దశాబ్దం నుంచి వార్తల్లో నిలుస్తోంది. రాజస్థాన్‌లోని కోటా(Kota) గురించే ఈ వార్త. తాజాగా అక్కడ కోచింగ్ తీసుకుంటున్న మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో 2024లో కోటా(Kota)లో ఆత్మహత్య చేసుకున్న తొలి విద్యార్థిగా వార్తల్లోకెక్కాడు. కోటా అనగానే కేరాఫ్ ఆత్మహత్యలు అనేలా పరిస్థితి మారింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన మహ్మద్ జైద్ మెడికల్ కళాశాల ప్రవేశ పరీక్ష అయిన నీట్‌కు సన్నద్ధమవుతున్నాడు.

జవహర్‌నగర్ హాస్టళ్లో ఉంటు కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తన గదిలో ఉరి వేసుకున్నాడు. అతను గతంలో ఒక సారి నీట్ తప్పినట్లు.. రెండోసారి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలు కచ్చితంగా తెలియరాలేదు. ఒత్తిడి తట్టుకోలేకే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


కోటా కేరాఫ్ ఆత్మహత్యలు

మహ్మద్ ఆత్మహత్యకుగల కారణాలు అన్వేషించడంలో పోలీసులు బిజీగా ఉండగా.. సూసైడ్లను ఆపడం అధికారులకు పెద్ద టాస్క్‌గా మారింది. 2023లో 26 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిలో చాలా మంది ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. డిప్రెషన్ తగ్గించడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసింది. కేంద్రం కూడా పలు సూచనలు చేసింది. వీటిలో 16 ఏళ్లలోపు విద్యార్థులు కోచింగ్‌లో చేరడంపై నిషేధం, వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

నీట్, జేఈఈ(NEET, JEE)ల్లో అత్యున్నత ప్రమాణాలతో ట్రైనింగ్ ఇచ్చేందుకు కోటా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి దేశ నలుమూలల నుంచి వందల సంఖ్యలో విద్యార్థులు ట్రైనింగ్ కోసం వస్తుంటారు. వారంతా అక్కడే ఉన్న హాస్టళ్లలో నివసిస్తుంటారు. అయితే చదువుల్లో ఒత్తిడి తదితర కారణాల వల్ల కొన్నేళ్లుగా కోటాలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 2024లో కూడా ఆత్మహత్యలు ఆగకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Updated Date - Jan 24 , 2024 | 11:35 AM

Advertising
Advertising