JP Nadda: చారిత్రక ఘటాన్ని తిలకించేందుకు సిద్ధంకండి.. ఎన్ఆర్ఐలకు నడ్డా పిలుపు
ABN, Publish Date - Jan 21 , 2024 | 10:59 AM
అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేందుకు సిద్ధం కావాలని ఎన్ఆర్ఐ(NRI)లకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) పిలుపునిచ్చారు.
ఢిల్లీ: అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేందుకు సిద్ధం కావాలని ఎన్ఆర్ఐ(NRI)లకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ... చారిత్రక ఘట్టం వేళ దేశ విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కార్యక్రమాన్ని చూడటానికి రావాలని కోరారు.
"శతాబ్దాల పరీక్షలు, పోరాటాల తరువాత రాముడు తన ఇంటికి తిరిగి వస్తున్నాడు. సుదీర్ఘ పోరాటంలో సత్యం, ధర్మం విజయం సాధించాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించండి. మన సాంస్కృతిక వారసత్వంలో ఇదొక మైలు రాయిగా మిగిలిపోతుంది. భారతీయ సంస్కృతిని ఖండాంతరాలు వ్యాపించేలా చేయడంలో ఎన్ఆర్ఐలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయోధ్య ఖ్యాతిని విదేశాల్లో చాటి చెప్పండి.ప్రధాని మోదీ దేశాన్ని అన్ని రంగాల్లోఅభివృద్ధిపథంలో నడిపిస్తున్నారు. ఆయన డైనమిక్ నాయకత్వంలో ఆలయాల అభివృద్ధి జరుగుతోంది. వికసిత్ భారత్ కలను సాకారం చేయడానికి బీజేపీ అహర్నిషలు కృషి చేస్తోంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా NRI for NAMO Again ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం" అని పేర్కొన్నారు.
Updated Date - Jan 21 , 2024 | 11:00 AM