ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhagwant Mann: ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు.. పంజాబ్ సీఎం స్పందన.. ఏమన్నారంటే?

ABN, Publish Date - Jan 17 , 2024 | 10:22 PM

తనని చంపేస్తానంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఇచ్చిన బెదిరింపులపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ బుధవారం స్పందించారు. తాను రాష్ట్ర శాంతి, శ్రేయస్సు సంరక్షకుడని.. అాంటి బెదిరింపులు వ్యూహాలకు తాను ఏమాత్రం భయపడబోనని అన్నారు.

తనని చంపేస్తానంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఇచ్చిన బెదిరింపులపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ బుధవారం స్పందించారు. తాను రాష్ట్ర శాంతి, శ్రేయస్సు సంరక్షకుడని.. అాంటి బెదిరింపులు వ్యూహాలకు తాను ఏమాత్రం భయపడబోనని అన్నారు. పంజాబ్ వ్యతిరేక శక్తులపై తమ ప్రభుత్వం అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానం వల్ల ఇలాంటి బెదిరింపులు రావడం అనేది సహజ పరిణామమని ఆరోపించారు. విదేశాల్లో ఉంటూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే నేరస్థులను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.


గురుపత్వంత్ లాంటి నేరస్థులు.. కష్టపడి సంపాదించిన రాష్ట్ర శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని భగవంత్ మాన్ అన్నారు. అయితే.. వారి దుష్ట ప్రయత్నాల్ని తన ప్రభుత్వం అడ్డుకుంటుందని నొక్కి చెప్పారు. ఈ పంజాబ్ వ్యతిరేకులు విదేశాల్లో తలదాచుకున్నారని.. వాళ్లను దేశానికి రప్పించి, వాళ్లు చేసిన నేరాలకు శిక్ష విధించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. పంజాబ్ ఒక సరిహద్దు రాష్ట్రం కావడంతో.. రాష్ట్రం లోపల, వెలుపల ఎన్నో సవాళ్లు ఉన్నాయన్నారు. అయితే.. అలాంటి బెదిరింపులకు ఏమాత్రం లొంగకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కుంటామని భగవంత్ మాన్ తెలిపారు.

గురుపత్వంత్ లాంటి భయంకరమైన నేరస్థులకు స్వర్గధామంగా ఉన్న దేశాలు.. ప్రపంచ శాంతిని దృష్టిలో ఉంచుకుని, ఆ నేరస్థుల్ని తిరిగి దేశానికి పంపాలని భగవంత్ మానే కోరారు. ఇలాంటి నేరస్థుల్ని దేశానికి రప్పించి, చట్టప్రకారం శిక్షించేలా భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో.. తన ప్రభుత్వ పనితీరు కారణంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాలను తమ పార్టీ ఆప్ గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తాము తప్పకుండా 13-0తో రాష్ట్రంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు.

Updated Date - Jan 17 , 2024 | 10:22 PM

Advertising
Advertising