Ram Mandir: తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు.. ఈనెల 29వ తేదీ నుంచి..
ABN, Publish Date - Jan 22 , 2024 | 09:17 PM
గత 500 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న హిందువుల కల నేటికి (జనవరి 22) నెరవేరింది. అయోధ్యలోని రామమందిరం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా.. వేలాదిమంది అతిరథ మహారథుల మధ్య రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది.
గత 500 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న హిందువుల కల నేటికి (జనవరి 22) నెరవేరింది. అయోధ్యలోని రామమందిరం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా.. వేలాదిమంది అతిరథ మహారథుల మధ్య రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ నేపథ్యంలోనే.. జనవరి 23వ తేదీ నుంచి సాధారణ భక్తుల కోసం రామాలయం తెరవబడుతుంది. దీంతో.. శ్రీరాముడిని దర్శించుకోవడం కోసం భక్తులందరూ అయోధ్యకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో.. అయోధ్యకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా ప్రత్యేక తేదీల్లో రైళ్లను కేటాయించారు.
తెలంగాణ నుంచి కూడా ఈనెల 29వ తేదీ నుంచి ఆస్థా రైళ్లను సిద్ధం చేయనున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భక్తులందరూ అయోధ్యకు వెళ్లేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే.. పార్లమెంట్ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నుండి 200 మందికి మాత్రమే అయోధ్యకు వెళ్లేలా అవకాశం కల్పిస్తున్నారు. అయోధ్యకు వెళ్లి రావడానికి 5 రోజుల గడువు ఇస్తున్నారు. మొత్తం 20 బోగీలు కలిగిన ఈ ఆస్థా రైళ్లలో.. ప్రతి బోగికి ఒక ఇంఛార్జ్‌ని నియమిస్తున్నారు. ఒక్కో ట్రైన్‌లో 1400 మందికి ఈ సువర్ణవకాశం కల్పిస్తున్నట్టు తెలిసింది. అక్కడ శ్రీరాముడిని దర్శించుకున్న తర్వాత, అదే రైలులో తిరిగొచ్చేలా ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఏయే ప్రాంతం నుంచి ఎప్పుడెప్పుడు రైళ్లు బయలుదేరనున్నాయంటే..
1. సికింద్రాబాద్ - జనవరి 29
2. వరంగల్ - జనవరి 30
3. హైదరాబాద్ - జనవరి 31
4. కరీంనగర్ - ఫిబ్రవరి 1
5. మల్కాజ్‌గిరి - ఫిబ్రవరి 2
6. ఖమ్మం - ఫిబ్రవరి 3
7. చేవెళ్ల - ఫిబ్రవరి 5
8. పెద్దపల్లి - ఫిబ్రవరి 6
9. నిజామాబాద్ - ఫిబ్రవరి 7
10. ఆదిలాబాద్ - ఫిబ్రవరి 8
11. మహబూబ్‌నగర్ - ఫిబ్రవరి 9
12. మహబూబాబాద్ - ఫిబ్రవరి 10
13. మెదక్ - ఫిబ్రవరి 11
14. భువనగిరి - ఫిబ్రవరి 12
15. నాగర్ కర్నూల్ - ఫిబ్రవరి 13
16. నల్గొండ - ఫిబ్రవరి 14
17. జహీరాబాద్ - ఫిబ్రవరి 15
Updated Date - Jan 22 , 2024 | 09:17 PM