ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NCPCR: యూట్యూబ్‌కు సమన్లు జారీ చేసిన చైల్డ్ రైట్స్ కమిషన్.. ఎందుకంటే?

ABN, Publish Date - Jan 11 , 2024 | 10:59 AM

యూట్యూబ్ లో పలు రకాల కంటెంట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చైల్డ్ రైట్ కమిషన్ యూట్యూబ్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. తల్లి కుమారుల మధ్య అసభ్యకర బంధాలను చూపుతున్న కొన్ని వీడియోలపై నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఢిల్లీ: యూట్యూబ్ లో పలు రకాల కంటెంట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చైల్డ్ రైట్ కమిషన్ యూట్యూబ్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. తల్లి కుమారుల మధ్య అసభ్యకర బంధాలను చూపుతున్న కొన్ని వీడియోలపై నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) ఆగ్రహం వ్యక్తం చేసింది. అటువంటి వీడియోలు పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానళ్ల జాబితాతో జనవరి 15న వ్యక్తిగతంగా తమ ముందుకు హాజరుకావాలంటూ యూట్యూబ్(YouTube) భారత ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ హెడ్ మీరా చాట్‌కు రాసిన లేఖలో కోరింది. ఎన్‌సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో మాట్లాడుతూ.. తల్లి కుమారుల మధ్య అసభ్యకరమైన చర్యలను చూపించే కొన్ని వీడియోలను యూట్యూబ్ లో గుర్తించామని తెలిపారు.

అలాంటివీడియోలను పోస్ట్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందులో కొన్ని వీడియోలు పోక్సో చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. యూట్యూబ్ ఈ సమస్యను పరిష్కరించాలని, వీడియోలు పోస్ట్ చేసేవారు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి వీడియోలను కమర్షియల్‌గా మార్చడం అంటే పోర్న్ అమ్మకానికి పెట్టడంలాంటిదని అభిప్రాయపడ్డారు. పిల్లలు లైంగిక వేధింపులకు గురైన వీడియోలను ప్రదర్శించే ఏ ప్లాట్ ఫాం అయినా శిక్షకు గురికాక తప్పదని హెచ్చరించారు.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Jan 11 , 2024 | 11:00 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising