Corona: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు
ABN, Publish Date - Jan 03 , 2024 | 01:47 PM
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా సబ్ వేరియంట్ (Corona Sub Varient) జేఎన్ 1(JN.1) కేసులు పెరిగిపోతున్నాయి. కోవిడ్ సబ్ వేరియంట్ జేఎన్-1 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా సబ్ వేరియంట్ (Corona Sub Varient) జేఎన్ 1(JN.1) కేసులు పెరిగిపోతున్నాయి. కోవిడ్ సబ్ వేరియంట్ జేఎన్-1 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 511 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. కర్ణాటక 199, కేరళ 148, గోవా 47, గుజరాత్ 36, మహారాష్ట్ర 32, తమిళనాడు 26, ఢిల్లీ 15, రాజస్థాన్ 4, తెలంగాణ 2, ఒడిశా 1, హర్యానాలో ఒకటి కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇది అంత ప్రమాదకరం కాదని వైద్యులు అంటున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం దేశంలో 511 కొత్త కరోనావైరస్ కేసులు నమోదు కాగా, క్రియాశీల కేసులు సంఖ్య మొత్తంగా 4,565 గా ఉన్నాయి.
కాగా విశాఖ జిల్లాలో మంగళవారం మరో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 83 మందికి పరీక్షలు నిర్వహించగా, ఐదుగురికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. వాటితో మొత్తం కేసుల సంఖ్య 43కు చేరింది. ప్రస్తుతం జిల్లాలో 30 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 25 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉండగా, ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లు, రద్దీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్క్‌లు ధరించాలంటున్నారు.
Updated Date - Jan 03 , 2024 | 01:47 PM