ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi: వితంతువుకు 27 వారాల గర్భం తొలగింపునకు కోర్టు అనుమతి.. ఎందుకంటే?

ABN, Publish Date - Jan 05 , 2024 | 08:11 AM

ఓ వితంతువు మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా 27 వారాల గర్బవిచ్ఛిత్తికి (Abortion) ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) అనుమతించింది. ఢిల్లీకి చెందిన మహిళ భర్త ఇటీవల ఓ ప్రమాదంలో మరణించాడు. అప్పటినుంచి ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతోంది.

ఢిల్లీ: ఓ వితంతువు మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా 27 వారాల గర్బవిచ్ఛిత్తికి (Abortion) ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) అనుమతించింది. ఢిల్లీకి చెందిన మహిళ భర్త ఇటీవల ఓ ప్రమాదంలో మరణించాడు. అప్పటినుంచి ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతోంది. మానసిక స్థితి కూడా బాలేదని వైద్య రిపోర్టులో తేలింది. అప్పటికే ఆమె 27 వారాల గర్భవతి. ఈ తరుణంలో గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలంటూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

'భర్తను కోల్పోయిన బాధలో పిటిషనర్ ఉంది. పిటిషనర్ పరిస్థితి కారణంగా మానసిక సమతుల్యత కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ ప్రక్రియలో ఆమె తనకు తాను హాని చేసుకోవచ్చు. ఈ తరుణంలో ఆమె తన గర్భాన్ని ముగించడానికి అనుమతిస్తున్నాం. ఆమెను గర్భంతో కొనసాగించడం ప్రమాదకరంగా భావిస్తున్నాం. ' అని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనే గతంలో ముంబయిలో జరిగింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడిన ఓ మహిళ 27 వారాల గర్భవిచ్ఛిత్తికి బాంబే హైకోర్టు గతంలో అనుమతించింది. కోర్టు ఆదేశాలతో ముంబయిలోని పరేల్‌ కేఈఎం ఆస్పత్రి వైద్యులు ఆగస్టు 8న అత్యవసర అబార్షన్ నిర్వహించగా.. శిశువు సజీవంగా జన్మించింది.

Updated Date - Jan 05 , 2024 | 08:13 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising