Ram Mandir: అలర్ట్.. ప్రసాదం, వీఐపీ ఎంట్రీ పాసుల పేరుతో భారీ మోసం
ABN, Publish Date - Jan 23 , 2024 | 09:01 PM
సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఇప్పటికే ట్రెండ్‌కి తగినట్టు వివిధ మార్గాల ద్వారా ప్రజలను బురిడీ కొట్టించి డబ్బులు దోచుకుంటున్న ఈ దుండగులు.. ఇప్పుడు శ్రీరాముడిని కూడా విడిచిపెట్టడం లేదు. ఆయన పేరు మీద కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఇప్పటికే ట్రెండ్‌కి తగినట్టు వివిధ మార్గాల ద్వారా ప్రజలను బురిడీ కొట్టించి డబ్బులు దోచుకుంటున్న ఈ దుండగులు.. ఇప్పుడు శ్రీరాముడిని కూడా విడిచిపెట్టడం లేదు. ఆయన పేరు మీద కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ప్రసాదం అందించడంతో పాటు వీఐపీ ఎంట్రీ పాసులు కూడా ఇప్పిస్తామని చెప్పి.. మోసాలకు పాల్పడుతున్నారు. జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగడం, రామ్‌లల్లాని దర్శించుకోవడం కోసం భక్తులందరూ అయోధ్యకు పోటెత్తుతున్న తరుణంలో.. సైబర్ నేరగాళ్లు ఈ కొత్త మోసానికి తెరలేపారు. ప్రసాదం, ఎంట్రీ పాసుల పేరిట భక్తుల్ని బురిడీ కొట్టించి.. భారీ స్థాయిలో డబ్బులు దండుకోవాలని ప్లాన్ చేశారు. ఆల్రెడీ కొందరు భక్తులు ఈ సైబర్ నేరగాళ్ల ట్రాప్‌లో పడి, భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నారని తెలిసింది.
Updated Date - Jan 23 , 2024 | 09:01 PM