ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi: కొత్త క్రిమినల్ చట్టాలపై అధ్యయనానికి కమిటీ.. ఢిల్లీ పోలీసుల కీలక నిర్ణయం

ABN, Publish Date - Jan 03 , 2024 | 09:07 AM

పార్లమెంటు ఇటీవల ఆమోదించిన మూడు కొత్త క్రిమినల్ చట్టాల(Criminal Law Bills) బిల్లులపై అధ్యయనం చేసేందుకు ఢిల్లీ పోలీసులు ఉన్నతస్థాయి అధికారులతో కూడిన కమిటీని ఇవాళ ఏర్పాటు చేశారు.

ఢిల్లీ: పార్లమెంటు ఇటీవల ఆమోదించిన మూడు కొత్త క్రిమినల్ చట్టాల(Criminal Law Bills) బిల్లులపై అధ్యయనం చేసేందుకు ఢిల్లీ పోలీసులు ఉన్నతస్థాయి అధికారులతో కూడిన కమిటీని ఇవాళ ఏర్పాటు చేశారు. భారతీయ న్యాయ సంహిత - 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత - 2023, భారతీయ సాక్ష్య బిల్లు - 2023లను బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న IPC, CrPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్ 25న ఈ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.

బిల్లుల అమలు తేదీకి సంబంధించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంకా అధికారిక నోటిఫికేషన్ జారీ చేయనప్పటికీ, ఢిల్లీ పోలీసు కమిషనర్, IPS ఛాయా శర్మ అధ్యక్షతన 13 మంది అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ అధికారులు ఆచరణాత్మక అవగాహన పొందడానికి, కొత్త నిబంధనలు, విధానాలలో మార్పులను అధ్యయనానికి కోర్సు మెటీరియల్‌ని సిద్ధం చేయడం కమిటీ బాధ్యత. భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం.. హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్ వెంటనే పోలీసులకు లొంగిపోతే 5 ఏళ్లు జైలు శిక్ష లేదంటే 10 ఏళ్ల ఖైదుగా నిర్ణయిస్తారు.

దీనికి తోడు రూ.7 లక్షలు ఫైన్ వేస్తారు. ఇదివరకు ఉన్న ఐపీసీ చట్టంలో హిట్ అండ్ రన్ నేరానికి 2 ఏళ్ల జైలు శిక్షే ఉండేది. డ్రైవర్ల వాదన ఏంటంటే.. 2 ఏళ్ల జైలు శిక్షను 10 ఏళ్లకు చేస్తే.. తమ జీవితాలు ఏం కావాలి అని, పూటకూడ గడవని తమకు రూ.7 లక్షల ఫైన్ వేస్తే ఎలా చెల్లించగలమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం ఏమంటుందంటే ప్రమాదం గురించి డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందిస్తే.. వారిపై కఠిన చర్యలు ఉండవని, హిట్ అండ్ రన్ చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించే వారికే చట్టంలోని కఠిన శిక్షలని చెబుతోంది.

Updated Date - Jan 03 , 2024 | 09:09 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising