ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంలోకి వానరం.. ఆ హనుమంతుడే వచ్చాడంటున్న భక్తులు!

ABN, Publish Date - Jan 24 , 2024 | 11:04 AM

సోమవారం ‘ప్రాణప్రతిష్ఠ’ క్రతువు పూర్తవ్వడంతో రామభక్తుల రద్దీతో అయోధ్య రామమందిరం కిటకిటలాడుతోంది. మంగళవారం ఉదయం నుంచే దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన తొలి రోజు మంగళవారమే లక్షలాది మంది శ్రీరాములవారిని దర్శించుకున్నారు. అయితే అంత జనసందోహం మధ్య మంగళవారం సాయంత్రం ఒక వానరం గర్భగుడిలోకి ప్రవేశించింది.

అయోధ్య: సోమవారం ‘ప్రాణప్రతిష్ఠ’ క్రతువు పూర్తవ్వడంతో రామభక్తుల రద్దీతో అయోధ్య రామమందిరం కిటకిటలాడుతోంది. మంగళవారం ఉదయం నుంచే దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన తొలి రోజు మంగళవారమే లక్షలాది మంది శ్రీరాములవారిని దర్శించుకున్నారు. అయితే అంత జనసందోహం మధ్య మంగళవారం సాయంత్రం ఒక వానరం గర్భగుడిలోకి ప్రవేశించింది. రాముడి ఉత్సవ విగ్రహం దగ్గరకు వెళ్లిందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం తెలిపింది. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన తొలి రోజున జరిగిన ఈ అనూహ్య ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ హనుమంతుడు స్వయంగా రామ్‌లల్లా దర్శనానికి వచ్చినట్టుగా అనిపిస్తోందని భక్తులు చెబుతున్నారు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఈ విషయంలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. మంగళవారం సాయంత్రం 5:50 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని, దక్షిణ ద్వారం నుంచి గర్భగుడిలోకి వానరం ప్రవేశించి ఉత్సవ విగ్రహం దగ్గరకు వెళ్లిందని వివరించింది. ‘‘ వానరాన్ని గమనించిన భద్రతా సిబ్బంది ఉత్సవ విగ్రహం నేలపై పడిపోతుందేమోనని ఆందోళన చెంది అటువైపుగా పరిగెత్తారు. అయితే, పోలీసులు అక్కడికి చేరుకోగానే వానరం ప్రశాంతంగా ఉత్తర ద్వారం వైపు వెళ్లింది. గేటు మూసి ఉండడంతో తూర్పు వైపునపు వెళ్లి జన సామూహాన్ని దాటుకొని ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా బయటకు వెళ్లిపోయింది. రామ్ లల్లాలను దర్శించుకోవడానికి ఆ భగవంతుడి వచ్చినట్టుగా ఉందని భద్రతా సిబ్బంది అంటున్నారు’’ అని ఆలయ ట్రస్ట్ పేర్కొంది. ‘ప్రాణప్రతిష్ఠ’ కార్యక్రమం ముగిసిన మరుసటి రోజే ఆవిష్కృతమైన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కాగా తొలి రోజయిన మంగళవారం ఏకంగా 5 లక్షల మంది భక్తులు రామ మందిరాన్ని సందర్శించారని ఆలయం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సమాచార శాఖ డైరెక్టర్ శిశిర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ ద్వారాలను ఉదయం 6 గంటలకు తెరచి రాత్రి 10 గంటల ప్రవేశ అనుమతిని ఇచ్చామని అన్నారు. రద్దీని నియంత్రించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని వివరించారు. ఉదయం జనాల రద్దీ ఎక్కువగా ఉందన్నారు. చిన్నపాటి తోపులాటలు జరిగాయన్నారు. అయితే పోలీసు సిబ్బంది, అధికారులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని, భక్తులను క్యూలైన్లలో నిలబెట్టి దర్శనానికి ఏర్పాట్లు చేశారని వివరించారు.

Updated Date - Jan 24 , 2024 | 11:04 AM

Advertising
Advertising