ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏక్‌నాథ్‌ షిండేదే అసలైన శివసేన

ABN, Publish Date - Jan 11 , 2024 | 04:04 AM

మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన చీలిక వర్గం అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శివసేన రెండు చీలికవర్గాల్లో ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్‌షిండే సారథ్యంలోని వర్గమే అసలైన శివసేన అని ఆ రాష్ట్ర స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌ బుధవారం ప్రకటించారు. ఇరువర్గాల్లోని ఏ ఎమ్మెల్యేపైనా అనర్హత వేటు వేయటం లేదని తెలిపారు.

అసమ్మతిపై ఫిరాయింపుల చట్టం వర్తించదు

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం లేదు

శివసేన నియమావళి ప్రకారం పార్టీ

నుంచి షిండేను ఉద్ధవ్‌ తొలగించలేరు

మెజారిటీ ఎమ్మెల్యేలు షిండేతోనే

నిర్ణయాన్ని వెలువరించిన మహారాష్ట్ర స్పీకర్‌

స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ కేసు వేస్తాం: ఉద్ధవ్‌

ముంబై, జనవరి 10: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన చీలిక వర్గం అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శివసేన రెండు చీలికవర్గాల్లో ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్‌షిండే సారథ్యంలోని వర్గమే అసలైన శివసేన అని ఆ రాష్ట్ర స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌ బుధవారం ప్రకటించారు. ఇరువర్గాల్లోని ఏ ఎమ్మెల్యేపైనా అనర్హత వేటు వేయటం లేదని తెలిపారు. తద్వారా షిండే వర్గంలోని 16 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న ఉద్ధవ్‌ ఠాక్రే విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన నిర్ణయంలోని ముఖ్యమైన అంశాలను నార్వేకర్‌ 105 నిమిషాలపాటు చదివి వినిపించారు. పార్టీలో అసమ్మతి లేదా క్రమశిక్షణా రాహిత్యంపై ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ప్రయోగించటం ఏ పార్టీ నాయకత్వానికి కూడా సాధ్యం కాదని స్పష్టం చేశారు. పార్టీలో రెండు చీలిక వర్గాలు ఉనికిలోకి వచ్చిన 2022 జూన్‌ 21వ తేదీ నాటి నుంచే ఉద్ధవ్‌ వర్గం విప్‌గా ఉన్న సునిల్‌ప్రభు ఆ పదవిని కోల్పోయారని, అధికారిక విప్‌ హోదా షిండే వర్గానికి చెందిన భరత్‌ గోగవాలెకు దక్కిందని స్పీకర్‌ తెలిపారు. వైరి వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఇరువర్గాలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తున్నానని, ఎవరినీ అనర్హులుగా ప్రకటించటం లేదన్నారు.

ఎన్నికల సంఘానికి శివసేన సమర్పించిన 1999 నాటి పార్టీ నియమావళి ప్రకారం.. పార్టీలో జాతీయ కార్యవర్గమే అత్యున్నత నిర్ణాయక వేదిక అని, పార్టీ నుంచి ఎవరినైనా తొలగించే అధికారం శివసేన ప్రముఖ్‌కు (అధ్యక్షుడికి) లేదని, కాబట్టి, షిండేను పార్టీ నుంచి ఉద్ధవ్‌ తొలగించలేరని పేర్కొన్నారు. పార్టీలో అధ్యక్షుడి మాటే అత్యున్నతం అని పేర్కొంటూ 2018లో శివసేన నియమావళిలో చేసిన సవరణను పరిగణనలోకి తీసుకోవాలన్న ఉద్ధవ్‌ వర్గం విజ్ఞప్తిని నిరాకరించినట్లు స్పీకర్‌ వెల్లడించారు. 2022 జూన్‌లో పార్టీ చీలినప్పుడు, మొత్తం 54 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 37 మంది షిండే వెంట ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్పీకర్‌ నిర్ణయంతో షిండే వర్గం సంబరాలు జరుపుకొంది. ‘ప్రజాస్వామ్యంలో అంకెలు (ఎమ్మెల్యేల సంఖ్య) కీలకం. అవి మా వద్ద ఉన్నాయి’ అని షిండే పేర్కొన్నారు. కాగా, స్పీకర్‌ నిర్ణయంపై ఉద్ధవ్‌ ఠాక్రే మండిపడ్డారు. ప్రజాస్వామ్యం హత్యకు గురైందని, న్యాయం కోసం తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. ఈ కేసులో సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టమైన మార్గదర్శకాలను వెలువరించినప్పటికీ.. వాటిని స్పీకర్‌ పట్టించుకోలేదన్నారు. అసలు విషయం ఎమ్మెల్యేల అనర్హత గురించి కాగా, స్పీకర్‌ దానిని పట్టించుకోనేలేదని చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు.. ఈ ద్రోహుల శివసేనను ఎన్నటికీ అంగీకరించరన్నారు. ఉద్ధవ్‌ వర్గం సుప్రీంకోర్టుకు వెళ్లాలని శరద్‌పవార్‌ సూచించారు.

Updated Date - Jan 11 , 2024 | 04:04 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising