ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ram Mandir: శ్రీ రాముడు కొలువైన ప్రముఖ దేవాలయాలివే

ABN, Publish Date - Jan 22 , 2024 | 09:12 AM

భారతావని రామ నామ స్మరణతో మార్మోగుతోంది. అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) సమక్షంలో జరగనుంది. ఈ సందర్భంగా దేశంలోని అనేక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయోధ్యతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో చారిత్రక నేపథ్యం కలిగిన రామాలయాలు(Ram Mandir) ఉన్నాయి.

ఢిల్లీ: భారతావని రామ నామ స్మరణతో మార్మోగుతోంది. అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) సమక్షంలో జరగనుంది. ఈ సందర్భంగా దేశంలోని అనేక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయోధ్యతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో చారిత్రక నేపథ్యం కలిగిన రామాలయాలు(Ram Mandir) ఉన్నాయి. వాటి వివరాలివే..

1.అయోధ్య రామమందిరం, యూపీ

ఈ ఆలయ చరిత్ర రాముడి జన్మస్థలంతో సంబంధం కలిగి ఉంది. భారతదేశ సాంస్కృతిక వారసత్వంతో ముడిపడి ఉంది. జనవరి 22న అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది

2. రామ్ రాజా ఆలయం, మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో ఉన్న ఈ ఆలయం చాలా ఫేమస్. రాముడితో ఈ ప్రాంతానికి దగ్గరి సంబంధం ఉందని చరిత్ర చెబుతోంది.

3. సీత రామచంద్ర స్వామి ఆలయం, తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో ఉన్న శ్రీ రాములవారి ఆలయం చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంది. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయ చరిత్ర రామాయణంతో ముడిపడి ఉంది. రాముడు, సీత వారి వనవాస సమయంలో ఇక్కడే ఉన్నారని భక్తుల నమ్మకం.

4.రామస్వామి ఆలయం, తమిళనాడు

తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలో రామ స్వామి ఆలయం శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ద్రవిడ శైలిని ప్రతిబింబిస్తుంది.

5.కాలారం ఆలయం, మహారాష్ట్ర

మహారాష్ట్ర రాష్ట్రం నాసిక్‌లో ఉన్న కాలారం ఆలయంలో రాముడు నల్లరాతిలో దర్శనమిస్తాడు. ఇది పేష్వా యుగం నాటి చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

6.త్రిప్రయార్ శ్రీ రామ దేవాలయం, కేరళ

కేరళలోని త్రిస్సూర్‌లో ఉన్న ఈ ఆలయం హిందూ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతాయి.

7.రామ మందిరం, ఒడిశా

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న ఈ ఆలయం కళింగ శైలిలో నిర్మితమైంది.


8.కోదండరామ దేవాలయం, కర్ణాటక

కర్ణాటక రాష్ట్రం హంపీలో ఉన్న ఈ ఆలయ గోడలపై రామాయణంలోని కీలక ఘట్టాలు పెయింటింగ్ రూపంలో ఉంటాయి.

9.శ్రీ రామ్ తీర్థ ఆలయం, అమృత్‌సర్

పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లో ఉన్న ఈ ఆలయానికి వాల్మీకి మహర్షితో అనుబంధం ఉంది. రామాయణంలోని భాగాలను వాల్మీకి ఇక్కడే రచించాడని చరిత్ర చెబుతోంది.

10.రఘునాథ్ ఆలయం, జమ్మూ

జమ్ముకశ్మీర్‌లోని జమ్మూలో ఉన్న ఈ ఆలయం చారిత్రక నేపథ్యం కలిగి ఉంది.

11.శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం అమ్మపల్లిలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. రాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు చరిత్ర చెబుతోంది.

Updated Date - Jan 22 , 2024 | 10:10 AM

Advertising
Advertising