ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జ్ఞానవాపిని హిందువులకివ్వండి: వీహెచ్‌పీ

ABN, Publish Date - Jan 28 , 2024 | 01:26 AM

వారాణసీలోని జ్ఞానవాపి మసీదు స్థలాన్ని ముస్లింలు.. హిందువులకు అప్పగించాలని వీహెచ్‌పీ డిమాండ్‌ చేసింది. ఆ ప్రదేశంలో పురాతన ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించినట్లు ఆర్కియోలాజికల్‌

న్యూఢిల్లీ, జనవరి 27: వారాణసీలోని జ్ఞానవాపి మసీదు స్థలాన్ని ముస్లింలు.. హిందువులకు అప్పగించాలని వీహెచ్‌పీ డిమాండ్‌ చేసింది. ఆ ప్రదేశంలో పురాతన ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించినట్లు ఆర్కియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక చెబుతున్నందున.. మసీదు నిర్వహణ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. వివాదాస్పద స్థలంలోని వాజుఖానాగా చెబుతున్న ప్రదేశంలో శివలింగాన్ని గుర్తించిన చోట పూజలు చేసుకునేందుకు హిందువులను అనుమతించాలని వీహెచ్‌పీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ప్రార్థనా స్థలాల చట్టం 1991లోని సెక్షన్‌ 4 ప్రకారం కూడా జ్ఞానవాపి ప్రదేశాన్ని హిందూ ఆలయంగా ప్రకటించాలన్నారు. మసీదు నిర్వహణ బాధ్యతలు చూసే ఇంతెజామియా కమిటీ గౌరవప్రదంగా దీనిని హిందూ సొసైటీకి అప్పగించి, మసీదును మరో చోటకు తరలించుకోవాలన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 08:16 AM

Advertising
Advertising