ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gyanvapi First Visuals: జ్ఞానవాపిలో మొదలైన పూజలు.. కోర్టు అనుమతి తరువాత కీలక పరిణామాలు

ABN, Publish Date - Feb 01 , 2024 | 04:02 PM

కోర్టు తీర్పు తరువాత ఎట్టకేలకు జ్ఞానవాపి మసీదు(Gyanvapi Mosque) బేస్‌మెంట్‌లో వ్యాస్ టిఖానా వద్ద హిందూ దేవతల విగ్రహాలకు గురువారం పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇవాళ విడుదలైంది.

వార‌ణాసి: కోర్టు తీర్పు తరువాత ఎట్టకేలకు జ్ఞానవాపి మసీదు(Gyanvapi Mosque) బేస్‌మెంట్‌లో వ్యాస్ టిఖానా వద్ద హిందూ దేవతల విగ్రహాలకు గురువారం పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇవాళ విడుదలైంది. మసీదు సముదాయంలో ఇంతకుముందు మూసివేసిన బేస్‌మెంట్‌ ‘వ్యాస్‌ కా టెఖానా’లో ఉన్న దేవతామూర్తులకు పూజలు చేసుకొనేందుకు వారాణాసి కోర్టు నిన్న అనుమతించింది. కాశీ విశ్వనాథ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అక్కడ పూజలు నిర్వహించాలని స్పష్టం చేసింది.

పూజల నిర్వహణ నిమిత్తం పూజారి ప్రవేశానికి వీలుగా అక్కడి బారికేడ్లను తొలగించాలని, వారం రోజుల్లోగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని బుధవారం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. కోర్టు తాజా ఆదేశాలతో పూజలు నిర్వహించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. సదరు వీడియోలో ఓ పూజారి హారతి ఇస్తుండటం కనిపిస్తోంది. ఈ దృశ్యాలు నిజమేనని లాయర్ విష్ణు శంకర్ జైన్ తెలిపారు.


ఇదీ జరిగింది...

బారికేడ్లను తొలగించేలోపు అంజుమన్‌ ఇంతేజామియా మస్‌జిద్‌ (జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ) సహా ప్రతివాదులకు అభ్యంతరాలు తెలియజేయడానికి కోర్టు అవకాశం కల్పించింది. ఈ ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేయాలని మసీదు కమిటీ భావిస్తోంది. జ్ఞాన్‌వాపీ మసీదు ప్రాంగణంలో ‘శివలింగం’ దొరికిందని భావిస్తున్న స్థలంలో సర్వే జరిపించేందుకు అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టులో నలుగురు మహిళలు వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో తాజా తీర్పు వెలువడటం గమనార్హం. జ్ఞాన్‌వాపీ మసీదు సెల్లార్‌లో శృంగార గౌరి, ఇతర దేవతామూర్తులను పూజించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆచార్య వేదవ్యాస్‌ పీఠం ప్రధాన పూజారి శైలేంద్ర కుమార్‌ పాఠక్‌ వ్యాస్‌ 2023 సెప్టెంబరు 25న పిటిషన్‌ దాఖలు చేశారు. 1993లో సెల్లార్‌ను అధికారులు మూసివేసే వరకూ తన తాతగారైన సోమనాథ్‌ వ్యాస్‌ అక్కడ పూజాదికాలు చేసేవారని, ఆయన శివైక్యం చెందిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పూజలు చేసే హక్కు తనకు కల్పించాలని శైలేంద్ర కోరారు.

అయితే సెల్లార్‌ మసీదు సముదాయంలో భాగమని అందువల్ల అక్కడ పూజలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వరాదని ముస్లింల తరఫు న్యాయవాది వాదించారు. దీంతో కోర్టు బేస్‌మెంట్‌లో పూజలకు అనుమతించింది. ఇదిలా ఉండగా, కాశీ విశ్వనాథుడి మందిరం పక్కన ఉన్న ఈ మసీదు కింద ఆలయం ఉందని హిందూ కక్షిదారులు జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో ఏఎ్‌సఐ సర్వేకు కోర్టు గతేడాది జూలై 21న ఆదేశించింది. సర్వే జరిపిన ఏఎస్ఐ డిసెంబరు 18న తన నివేదికను కోర్టుకు సమర్పించింది. హిందూ, ముస్లిం కక్షిదారులకు ఈ నివేదిక ప్రతులను ఇప్పటికే అందించారు. అయితే ఇక్కడి శివలింగానికి హాని కలుగకుండా వాజూ ఖానా ప్రాంతంలో మరోసారి ఏఎస్ఐ సర్వే చేయాలని హిందూ కక్షిదారులు కోర్టును అభ్యర్థించారు.

"మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Feb 01 , 2024 | 08:39 PM

Advertising
Advertising