Home » Gnanavapi Masjid Case
జ్ఞాన్వాపి అనేది మసీదు కాదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్(Yogi Adityanath) సంచలన వ్యాఖ్యలు చేశారు. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదును ముస్లింల ప్రార్థనా స్థలంగా పిలవడంపై యోగీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
జ్ఞానవాపి (Gyanvapi) మసీదు లోపల హిందువులు పూజ చేయడాన్ని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో (Supreme Court) సవాల్ చేసింది. మసీదులో గల వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజ చేసుకోవడానికి వారణాసి కోర్టు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దానిని అంజుమన్ కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. అక్కడ చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
జ్ఞానవాపి మసీదు సముదాయంలోని వ్యాస్ బేస్మెంట్లో పూజలు చేసుకునేందుకు వ్యతిరేకంగా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ( Supreme Court ) ఇవాళ విచారించింది. మసీదు తరఫు న్యాయవాది హుజైఫా అహ్మదీ వాదనలు వినిపించారు.
దేశవ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు అంశం ఎంతటి వివాదాస్పద అంశంగా మారిందో అందరికీ తెలిసిందే. హిందువులు పరమ పవిత్రంగా భావిస్తున్న కాశీ విశ్వనాథ్ ఆలయంపై జ్ఞానవాపి ( Gnanavapi ) మసీదును నిర్మించారనే వార్తలు భారత్ అంతటా పెను సంచలనం కలిగించాయి.
కోర్టు తీర్పు తరువాత ఎట్టకేలకు జ్ఞానవాపి మసీదు(Gyanvapi Mosque) బేస్మెంట్లో వ్యాస్ టిఖానా వద్ద హిందూ దేవతల విగ్రహాలకు గురువారం పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇవాళ విడుదలైంది.
జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నేలమాళిగలోని శివాలయం ఉన్నట్లు పేర్కొంటున్న ప్రాంతంలో పూజించే హక్కు హిందువులకు ఉందని తెలిపింది. ..
ఓ వైపు శరవేగంగా సాగుతున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ పనులు.. మరోవైపు కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్లు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశాలుగా మారుతున్నాయి
ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం వారనాసిలోని జ్ఞాన్వాపి మసీదులో కొనసాగుతున్న సర్వేలో కనుగొన్న హిందూ(Hindu) మతానికి సంబంధించిన అన్ని ఆధారాలను జిల్లా మేజిస్ట్రేట్‌కు(District Majistrate) అప్పగించాలని వారణాసి(Varanasi) కోర్టు బుధవారం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించింది.
జ్ఞానవాపి మసీద్ ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) శాస్త్రీయ సర్వేపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తవ్వకాలు లేకుండా, నిర్మాణానికి నష్టం వాటిల్లకుండా మొత్తం సర్వేను పూర్తి చేస్తామని ASI స్పష్టం చేసినట్లు ధర్మాసనం తెలియజేసింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.