ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi: గృహ రుణ వడ్డీ రాయితీ పథకం త్వరలో.. వివరాలు వెల్లడించిన మంత్రి

ABN, Publish Date - Jan 12 , 2024 | 07:29 PM

గతేడాది ప్రధాని మోదీ(PM Modi) స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తక్కువ, మధ్య ఆదాయ వర్గాలకు ప్రకటించిన గృహ రుణ వడ్డీ రాయితీ పథకం మార్గదర్శకాలు తుదిదశకు చేరుకున్నాయని కేంద్ర గ‌ృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి(Hardeep Singh Puri) శుక్రవారం తెలిపారు.

ఢిల్లీ: గతేడాది ప్రధాని మోదీ(PM Modi) స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తక్కువ, మధ్య ఆదాయ వర్గాలకు ప్రకటించిన గృహ రుణ వడ్డీ రాయితీ పథకం మార్గదర్శకాలు తుదిదశకు చేరుకున్నాయని కేంద్ర గ‌ృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి(Hardeep Singh Puri) శుక్రవారం తెలిపారు. ఈ పథకం విధివిధానాలు దాదాపు ఖరారైనట్లు వివరించారు.

“పథకం రూపకల్పనలో చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది. అనేక అంశాలపై చర్చలు జరిగాయి. ప్రస్తుతం చివరి దశలో ఉంది. తరువాత దీని విధివిధానాలను కేబినేట్ ముందుకు తీసుకెళ్తాం”అని పూరీ అన్నారు. భారత్ లో పట్టణ పాలనకు 2023 ఒక అద్భుతమైన సంవత్సరంగా అభివర్ణించిన పూరీ, 2014 నుండి పట్టణాభివృద్ధికి రూ.18.07 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్), PMAY(U) పథకం కింద 1.18 కోట్ల గృహాలు నిర్మించాం. తక్కువ ఆదాయం పొందే పౌరుల కోసం urban హౌసింగ్ క్రెడిట్ పథకంతో ముందుకు రావాలనే ప్రభుత్వ ప్రణాళికను మోదీ గతేడాది ప్రకటించారు.

"రాబోయే సంవత్సరాల్లో మేం ఒక కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నాం. దీంతో నగరాల్లో అద్దె ఇళ్లలో నివసించేవారు, మురికివాడల్లో నివసించే కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. వారు సొంతింటిని నిర్మించుకోవాలనుకుంటే వారికి లక్షల రూపాయలను ఆదా చేసే బ్యాంకుల నుండి రుణాలను అందించడంలో సహాయం చేస్తాం" అని వివరించారు.

Updated Date - Jan 12 , 2024 | 07:30 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising