ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Navy: భారత నేవీలోకి అధునాతన యుద్ధ విమానాలు.. కొనుగోలుకు ఎంత ఖర్చవుతుందంటే

ABN, Publish Date - Feb 17 , 2024 | 12:45 PM

భారత నేవీని(Indian Navy) మరింత పటిష్టం చేసేందుకు రక్షణ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలతో యుద్ధ నౌకలు, ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న భారత్ తాజాగా యుద్ధ విమానాల కొనుగోలుకు కూడా ముందుకొచ్చింది.

ఢిల్లీ: భారత నేవీని(Indian Navy) మరింత పటిష్టం చేసేందుకు రక్షణ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలతో యుద్ధ నౌకలు, ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న భారత్ తాజాగా యుద్ధ విమానాల కొనుగోలుకు కూడా ముందుకొచ్చింది. హిందూ మహాసముద్రంలో(Indian Ocean) తన సామర్థ్యాలను పెంచుకునే క్రమంలో డజనుకు పైగా సముద్ర నిఘా విమానాలను కొనుగోలు చేయనుంది.

విమానయాన దిగ్గజ సంస్థ ఎయిర్‌బస్ SE నుంచి 290 బిలియన్ డాలర్లతో ఈ కొనుగోలు ఒప్పందం జరిగింది. అంటే ఈ ఒప్పందం విలువ భారత కరెన్సీలో అక్షరాల రూ.2,900 కోట్లన్నమాట. "మధ్యస్థ-శ్రేణి, బహుళ మిషన్ సముద్ర నిఘా విమానం దేశ సముద్ర ప్రాంతంలో భారత నావికాదళం, భారత కోస్ట్ గార్డ్ నిఘా సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది" అని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.


భారత నౌకాదళానికి వీటిలో తొమ్మిది విమానాలు లభిస్తాయని, మిగిలిన ఆరు కోస్ట్ గార్డ్‌కు వెళ్తాయని అధికారులు చెప్పారు. C-295కి చెందిన నాలుగు విమానాలు తయారీ ప్రక్రియలో ఉన్నాయన్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగించే వారిపై ప్రతి దాడి కోసం భారత్ అరేబియా సముద్రంలో దాదాపు డజను యుద్ధనౌకలు, మానవరహిత వైమానిక వాహనాల సముదాయం, దీర్ఘ-శ్రేణి సముద్ర నిఘా విమానాలను మోహరించింది.

ఇప్పుడు హిందూ మహా సముద్ర తీరంలో కూడా శత్రువులపై నిఘా ఉంచడానికి విమానాల కొనుగోలుకు ముందుకొచ్చింది. దీంతో దేశానికి రెండు వైపులా ఉన్న సముద్రాల్లో భారత్ తన నిఘాను పటిష్టపరుచుకున్నట్లైంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2024 | 12:45 PM

Advertising
Advertising