Ayodhya Ram Mandir: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం.. ఎవరెవరు గైర్హాజరు కానున్నారంటే?
ABN, Publish Date - Jan 21 , 2024 | 07:05 PM
ఒకవైపు అయోధ్యలోని రామమందిరలో రేపు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఎదురుచూస్తుంటే.. మరోవైపు కొందరు రాజకీయ నేతలు మాత్రం ఈ వేడుకలకు హాజరు కావడం లేదు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారికి ఆహ్వానాలు అందాయి కానీ, వాళ్లు తిరస్కరించారు.
ఒకవైపు అయోధ్యలోని రామమందిరలో రేపు (జనవరి 22న) ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఎదురుచూస్తుంటే.. మరోవైపు కొందరు రాజకీయ నేతలు మాత్రం ఈ వేడుకలకు హాజరు కావడం లేదు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారికి ఆహ్వానాలు అందాయి కానీ, వాళ్లు తిరస్కరించారు. ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం.. ప్రధాని మోదీ వేడుకగానూ, బీజేపీ ఎన్నికల జిమ్మిక్కుగానూ పేర్కొంటూ వాళ్లు తమకందిన ఆహ్వానాలను రిజెక్ట్ చేశారు. ఇండియా కూటమిలో భాగమైన దాదాపు ప్రతిపక్ష పార్టీలన్నీ.. ఈ వేడుకల్లో తాము పాల్గొనడం లేదని స్పష్టం చేశాయి. ఇంతకీ, ఆ నేతలు ఎవరంటే..
కాంగ్రెస్: మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరి, మన్మోహన్ సింగ్
తృణమూల్ కాంగ్రెస్: మమతా బెనర్జీ
ఆమ్ ఆద్మీ పార్టీ: అరవింద్ కేజ్రీవాల్
శివసేన(యూబీటీ): ఉద్ధవ్ థాక్రే
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ: శరద్ పవార్
నేషనల్ కాన్ఫరెన్స్: ఫరూక్ అబ్దుల్లా
సీపీఐ (మార్క్సిస్టు): సీతారాం ఏచూరి
ఇతరులు: హెచ్‌డీ దేవెగౌడ, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి
అటు.. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మొదట విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నుండి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించారు. తనకు తెలియని వ్యక్తుల నుండి ఆహ్వానాన్ని అంగీకరించలేనని ఆయన చెప్పారు. అయితే.. ఆ తర్వాత తనని ఈ ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ రామాలయ ట్రస్టుకు లేఖ రాశారు. ఈ కార్యక్రమం ముగిశాక తాను తన కుటుంబ సభ్యులతో కలిసి వస్తానని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇదిలావుండగా.. ఈ వేడుక కోసం అయోధ్యకు వచ్చే సందర్శకుల కోసం 51 ప్రదేశాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా.. వీవీఐపీలు, వీఐపీలు, ఇతర అతిథుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
Updated Date - Jan 21 , 2024 | 07:16 PM