ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bharat Ratna: ‘భారతరత్న’ పురస్కారం వరించడంపై తొలిసారి స్పందించిన ఎల్‌కే అద్వానీ

ABN, Publish Date - Feb 03 , 2024 | 03:58 PM

‘భారతరత్న’ పురస్కారం వరించడంపై మాజీ ఉప ప్రధాని, రాజనీతిజ్ఞుడు, బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ (LK Advani Bharat Ratna) తొలిసారి స్పందించారు. అత్యంత వినమ్రత ,కృతజ్ఞతతో ప్రదానం చేసిన 'భారతరత్న'ని తాను గర్వంగా అంగీకరిస్తున్నానని అద్వానీ అన్నారు.

న్యూఢిల్లీ: ‘భారతరత్న’ పురస్కారం వరించడంపై మాజీ ఉప ప్రధాని, రాజనీతిజ్ఞుడు, బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ (LK Advani Bharat Ratna) తొలిసారి స్పందించారు. అత్యంత వినమ్రత ,కృతజ్ఞతతో ప్రదానం చేసిన 'భారతరత్న'ని తాను గర్వంగా అంగీకరిస్తున్నానని అద్వానీ అన్నారు. ఇది ఒక వ్యక్తిగా తనకు దక్కిన గౌరవం మాత్రమే కాదని, జీవితాంతం శక్తి మేరకు సేవ చేయడానికి తాను అవలంభించిన ఆదర్శాలు, సూత్రాలకు కూడా దక్కిన గౌరవంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ‘‘ నేను 14 సంవత్సరాల వయస్సులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో (RSS) వాలంటీర్‌గా చేరిన నాటి నుంచి జీవితంలో నాకు అప్పగించిన ప్రతి పనినీ నాకు ఇష్టమైన దేశం కోసం అంకితభావంతో, నిస్వార్థంగా సేవ చేశాను. ‘ఇదం న మమ్’(ఈ జీవితం నాది కాదు. నా జీవితం నా దేశం కోసం) నా జీవితాన్ని ప్రేరేపించింది’’.

‘‘భారత రత్న దక్కిన సందర్భంగా నేను సన్నిహితంగా పనిచేసిన ఇద్దరు వ్యక్తులు- పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయి‌లను కృతజ్ఞతతో స్మరించుకుంటున్నాను. ప్రజాజీవితంలో, నా ప్రయాణంలో కలిసి పనిచేసిన లక్షలాది మంది నా పార్టీ కార్యకర్తలు, స్వయంసేవకులు, ఇతరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా నా ప్రియమైన భార్య కమలకు ధన్యవాదాలు. వీరంతా జీవితంలో నాకు అండదండగా నిలిచారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ పురస్కారాన్ని అందించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. మన దేశం గొప్పతనం కీర్తి శిఖరాగ్రానికి పురోగమిస్తోంది’’ అంటూ ఎల్‌కే ప్రకటన విడుదల చేశారు.

Updated Date - Feb 03 , 2024 | 03:58 PM

Advertising
Advertising