ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

LK Advani: ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాని అద్వానీ, ఎందుకంటే..

ABN, Publish Date - Jan 22 , 2024 | 12:16 PM

అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే(LK Advani) అద్వానీ హాజరుకాలేదు. అయోధ్య రామమందిర పోరాటంలో ఆయన రథసారథిగా నిలిచారు. అయితే అయోధ్యలో విపరీతమైన చలి గాలుల కారణంగా ఆయన ఆరోగ్యం దృష్ట్యా ప్రాణ ప్రతిష్ఠకు హాజరుకావట్లేదని తెలుస్తోంది.

ఢిల్లీ: అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే(LK Advani) అద్వానీ హాజరుకాలేదు. అయోధ్య రామమందిర పోరాటంలో ఆయన రథసారథిగా నిలిచారు. అయితే అయోధ్యలో విపరీతమైన చలి గాలుల కారణంగా ఆయన ఆరోగ్యం దృష్ట్యా ప్రాణ ప్రతిష్ఠకు హాజరుకాలేదని తెలుస్తోంది. ఆయనతోపాటు బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత మనోహర్ జోషి కూడా ఈ కార్యక్రమానికి రావట్లేదు.

"వాతావరణం చల్లగా ఉండటంతో ఇరువురు నేతల వయసును పరిగణలోకి తీసుకుని అయోధ్యకు రావొద్దని సూచించాం. దీనికి వారు అంగీకరించారు" అని రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ గతంలో తెలిపారు. అయితే ఇద్దరు నేతలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ వెల్లడించారు. అప్పటి నుంచి వీరి రాకపై సందిగ్ధం ఏర్పడింది. చలి గాలుల ప్రభావంతో అద్వానీ, జోషిలు అయోధ్యకు రావడం శ్రేయస్కరం కాదని వైద్యులు చెప్పడంతో ఇరువురు నేతలు సోమవారం జరిగిన కార్యక్రమానికి రాలేకపోయారు. 2023 డిసెంబర్‌‌లో రామమందిరం ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలను వీహెచ్‌పీ ఆహ్వానించింది.

Updated Date - Jan 22 , 2024 | 12:28 PM

Advertising
Advertising