Ayodhya: అయోధ్య గర్భగుడిలో ‘రామ్ లల్లా’ విగ్రహం
ABN, Publish Date - Jan 18 , 2024 | 01:48 PM
ఈ నెల 22న జరగనున్న ‘ప్రాణప్రతిష్ఠాపన’ కార్యక్రమానికి ముందు కీలక ఘట్టం చోటుచేసుకుంది. సుమారు 550 ఏళ్ల తర్వాత అయోధ్య రామాలయం గర్భగుడిలో ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అయోధ్య: ఈ నెల 22న జరగనున్న ‘ప్రాణప్రతిష్ఠాపన’ కార్యక్రమానికి ముందు కీలక ఘట్టం చోటుచేసుకుంది. సుమారు 550 ఏళ్ల తర్వాత అయోధ్య రామాలయం గర్భగుడిలో ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వేద మంత్రోచ్చారణ, జై శ్రీరామ్ నినాదాల మధ్య గురువారం ఈ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. మైసూరుకు చెందిన శిల్పకళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 ఇంచుల ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని గుర్భగుడిలో ఉంచారు. కాగా గురువారం వేకువ జామున విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకొచ్చారు. ఓ ట్రక్కు ద్వారా తరలించి ఆ తర్వాత క్రేన్ సాయంతో గర్భగుడిలోకి చేర్చారు.
Updated Date - Jan 18 , 2024 | 01:55 PM