ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Madyapradesh: బాలిక గర్భవిచ్ఛిత్తికి అనుమతి.. కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

ABN, Publish Date - Jan 10 , 2024 | 03:25 PM

ఓ యువకుడి చేతిలో అత్యాచారానికి గురై గర్భం దాల్చిన బాలిక కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె గర్భవిచ్ఛిత్తికి అనుమతిస్తూ తీర్పునిచ్చింది. సాగర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలికపై 2023 అక్టోబర్ 23న ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది.

జబల్పూర్: ఓ యువకుడి చేతిలో అత్యాచారానికి గురై గర్భం దాల్చిన బాలిక కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె గర్భవిచ్ఛిత్తికి అనుమతిస్తూ తీర్పునిచ్చింది. సాగర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలికపై 2023 అక్టోబర్ 23న ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. బాలికలో మార్పులు గమనించిన తండ్రి అసలు విషయం తెలుసుకున్నాడు.

నిందితుడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు, పోక్సో తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకుని మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రవేశపెట్టారు. అప్పటికే బాలిక 8 వారాల గర్భవతి అని బాధితురాలి న్యాయవాది జడ్జితో తెలిపారు. చిన్నతనంలోనే గర్భం రావడం.. ఆమె తనకాళ్లపై తాను నిలబడలేని పరిస్థితి రాకుండా ఉండేందుకు గర్భవిచ్ఛిత్తికి అనుమతినివ్వాలని లాయర్ కోరారు.


దీనిపై విచారించిన కోర్టు గర్భవిచ్ఛిత్తికి అనుమతించింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ జీఎస్ అహ్లూవాలియా ధర్మాసనం విచారించింది. అంతకు ముందు బాధితురాలి తండ్రి జిల్లా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (CJM) ముందు ఆమె అత్యాచారానికి గురైందని అఫిడవిట్‌ను సమర్పించాలని ఆదేశించింది.

ఒకవేళ నిందితుడు అత్యాచారం చేయలేదని, తనను తాను మేజర్‌గా బాలిక అంగీకరిస్తే ట్రయల్ కోర్టు తన నివేదికను ప్రాసిక్యూట్రిక్స్ డిపాజిషన్ షీట్‌తో పాటు కోర్టు రిజిస్ట్రార్ జనరల్ ముందు సమర్పించాలని ఆదేశిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణ అధికారి అఫిడవిట్ ధృవీకరించబడిన కాపీని పొందాక దానిని కేసు డైరీలో ఉంచాలి. అనంతరం దానిని మెడికల్ బోర్డు ముందు సమర్పించాలి. ఆ తరువాత మాత్రమే బోర్డు గర్భ రద్దుకి అనుమతిస్తుందని కోర్టు ఉత్తర్వులో పేర్కొంది. బాలిక తండ్రి పిటిషన్ మేరకు కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Jan 10 , 2024 | 03:25 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising