Nyay yatra : ఈశాన్యంపై మోదీ నిర్లక్ష్యం
ABN, Publish Date - Jan 18 , 2024 | 03:16 AM
ఈశాన్య భారతాన్ని ఏదో ఉద్ధరిస్తున్నట్లు ప్రధాని మోదీ గొప్పలు చెబుతుంటారని.. నిజానికి ఈ ప్రాంతాన్ని ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రధానంగా నాగాలాండ్‌లో మౌలిక
‘న్యాయ్ యాత్ర’లో రాహుల్ గాంధీ ధ్వజం
మణిపూర్ ఘర్షణల్లో ఇద్దరు కమెండోల మృతి
న్యూఢిల్లీ/కోహిమా, జనవరి 17: ఈశాన్య భారతాన్ని ఏదో ఉద్ధరిస్తున్నట్లు ప్రధాని మోదీ గొప్పలు చెబుతుంటారని.. నిజానికి ఈ ప్రాంతాన్ని ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రధానంగా నాగాలాండ్‌లో మౌలిక వసతుల అభివృద్ధే లేదని ఆక్షేపించారు. ఒకసారి వచ్చి ఈ రోడ్లపై తిరగాలని సవాల్ విసిరారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా బుధవారం ఆయన ఓ సభలో ప్రసంగించారు. గతుకుల రోడ్లు, అరకొరగా కరెంటు సదుపాయం, వైద్య వసతులు లేమిని విమర్శించారు. ‘నాగాలాండ్ ప్రజలను ఈ చెత్త రోడ్లపై తిరగమనడం అన్యాయం. వారిని మోసగించడమే! ఇలాంటి రోడ్లపై యువతకు సానుకూల భవిష్యత్ అందించగలమని ఎలా ఆశిస్తాం? నాగాలాండ్, మణిపూర్, అసోం ప్రజలపై యావద్దేశం దృష్టి సారించేలా చేసేందుకే భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టాను’ అని ధ్వజమెత్తారు.
మణిపూర్‌లో చల్లారని జ్వాలలు
మణిపూర్‌లో వర్గవైషమ్యాలు ఇంకా చల్లారలేదు. ప్రతి రోజూ ఘర్షణలు జరుగుతున్నాయి. బుధవారం సరిహద్దు పట్టణం మోరే్‌హలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఇద్దరు కమెండోలు చనిపోయారు. హింసాత్మక ప్రాంతాల్లోకి అదనపు బలగాలను తరలించడం కష్టంగా మారింది. ఆందోళనకారులు వాటిపై దాడులకు దిగుతున్నారు. దీంతో హెలికాప్టర్ల ద్వారా వారిని తరలించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. రాజధాని ఇంఫాల్‌కు హెలికాప్టర్లు పంపాలని కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది. నిరుడు అక్టోబరు 31న సీనియర్ పోలీసు అధికారి హత్యకు సంబంధించి ఇద్దరు కుకీలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలని బుధవారం కుకీలు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా, మణిపూర్ ఘర్షణల్లో పోలీసు ఆయుధాలను లూటీ చేశారన్న ఆరోపణలతో అయిదుగురిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది.
మేనిఫెస్టోకు సూచనలు పంపండి: కాంగ్రెస్
రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలను సూచించాల్సిందిగా ప్రజలను కాంగ్రెస్ కోరింది. ప్రజల నుంచి వచ్చే సూచనల్లో సాధ్యమైనన్ని ఎక్కువ అంశాల్ని చేర్చడం ద్వారా తమ పార్టీ మేనిఫెస్టోను ప్రజల మేనిఫెస్టోగా రూపొందించనున్నామని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సారథి చిదంబరం తెలిపారు. మేనిఫెస్టో కమిటీ సభ్యులు ప్రతి రాష్ట్రంలో ప్రజలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరుపుతారని, సూచనల కోసం ఈ-మెయిల్ అకౌంట్‌ను వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభిస్తామన్నారు. ప్రజలు తమ సూచనలను ్చఠ్చ్చ్డీఛజ్చిట్చ్టజుజీఃజీుఽఛి.జీుఽ లేదా ఠీఠీఠీ.్చఠ్చ్చ్డీఛజ్చిట్చ్టజుజీ.జీుఽ కు పంపాలన్నారు.
Updated Date - Jan 18 , 2024 | 03:16 AM