ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tamilnadu Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒళ్ళు గగుర్పొడిచే ఘటన

ABN, Publish Date - Jan 25 , 2024 | 02:53 PM

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మపురి జిల్లాలోని తొప్పూర్ ఘాట్ రోడ్ వద్ద ఓ వంతెనపై బహుళ వాహనాలు ఢీకొన్నాయి. మూడు ట్రక్కులు, రెండు కార్లు ఢీకొనడంతో.. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలవ్వగా.. చికిత్స నిమిత్తం వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మపురి జిల్లాలోని తొప్పూర్ ఘాట్ రోడ్ వద్ద ఓ వంతెనపై బహుళ వాహనాలు ఢీకొన్నాయి. మూడు ట్రక్కులు, రెండు కార్లు ఢీకొనడంతో.. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలవ్వగా.. చికిత్స నిమిత్తం వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకోగా.. సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.


ఆ వీడియోని గమనిస్తే.. వేగంగా దూసుకొస్తున్న ఈ ట్రక్కు ఎదురుగా వెళ్తున్న రెండు ట్రక్కులను ఢీకొంది. దీంతో.. ఒక ట్రక్కు అదుపు తప్పి వంతెనలో పడిపోయింది. ఈ మూడు ట్రక్కుల మధ్య వెళ్తున్న ఒక కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఇంతలోనే ఓ ట్రక్కుకు మంటలు అంటుకున్నాయి. మరోవైపు.. ఈ ప్రమాదంలో మరో కారు కూడా ధ్వంసం అయ్యింది. ఫలితంగా.. ఇద్దరు మహిళలతో కలిపి మొత్తం నలుగురు మృతి చెందారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే.. గాయాలైన వారికి రూ.50 వేల సహాయాన్ని అందజేశారు.

ఈ ఘటనపై ధర్మపురి డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ స్పందిస్తూ.. పెండింగ్‌లో ఉన్న ఎలివేటెడ్ నేషనల్ హైవే పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయన్న భయంతోనే తాము తొప్పూర్ ఘాట్ సెక్షన్ వద్ద మంజూరైన ఎలివేటెడ్ హైవేని సత్వరమే అమలు చేయాలని పట్టుబడుతున్నామన్నారు.

Updated Date - Jan 25 , 2024 | 03:04 PM

Advertising
Advertising