Bihar Crisis: నితీష్ రాజీనామా ఖాయమే.. ఎప్పుడంటే..?
ABN, Publish Date - Jan 26 , 2024 | 05:20 PM
లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్‌లోని అధికార 'మహాఘట్బంధన్'లో తలెత్తిన సంక్షోభం కీలకమలుపు తిరిగే అవకాశాలున్నాయి. మహాకూటమిలోని ఆర్జేడీతో తెగతెంపులు చేసుకునేందుకే జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ దృఢ నిశ్చయంతో ఉన్నారని, బీజేపీ మద్దతుతో సీఎంగా కొనసాగేందుకు ఆయన మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి ఆయన శనివారంనాడు రాజీనామా చేసే అవకాశాలున్నట్టు బలంగా వినిపిస్తోంది.
పాట్నా: లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్‌లోని అధికార 'మహాఘట్బంధన్'లో తలెత్తిన సంక్షోభం కీలకమలుపు తిరిగే అవకాశాలున్నాయి. మహాకూటమిలోని ఆర్జేడీతో తెగతెంపులు చేసుకునేందుకే జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ (Nitish Kumar) దృఢ నిశ్చయంతో ఉన్నారని, బీజేపీ మద్దతుతో సీఎంగా కొనసాగేందుకు ఆయన మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి ఆయన శనివారంనాడు రాజీనామా చేసే అవకాశాలున్నట్టు బలంగా వినిపిస్తోంది.
నితీష్ నిర్ణయానికి అదే కారణమా?
కొద్దికాలంగా కూటమి భాగస్వామి అయిన ఆర్జేడీ తీరుపై అసంతృప్తితో కనిపిస్తున్న నితీష్ కుమార్ ఆ పార్టీకి దూరంగా జరగాలనే తుది నిశ్చయానికి రావడం వెనుక కారణం ఏమిటనేది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఆనువంశిక పాలనపై నితీష్ కుమార్ గురువారంనాడు చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య చేసిన వరుస ట్వీట్లు ఆయనకు ఆగ్రహం కలిగించినట్టు చెబుతున్నారు. ఆ వెనువెంటనే ఢిల్లీలో ఒకటి, పాట్నాలో మరొకటి కీలక సమావేశాలు జరిగాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సారథ్యంలో ఢిల్లీలో మొదటి సమావేశం జరుగగా, పాట్నాలో నితీష్ కుమార్ ఆధ్యక్షతన రెండో సమావేశం జరిగింది. కాగా, ఇప్పటికే నితీష్ తమతో కలిసి వస్తామంటే ఆలోచిస్తామని అమిత్‌షాతో పాటు, రాష్ట్ర బీజేపీ నేతలు సంకేతాలిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తాయనే కొన్ని అంచనాలు కూడా నితీష్‌ను ఆలోచింప చేసి ఉండవచ్చని అంటున్నారు. ప్రధాని కావాలన్న ఆశలు ఇప్పట్లో నెరవేరే అవకాశం కనిపించకపోవడం, సీఎం పదవిని వదులుకోవడం ఇష్టం లేకపోవడం వంటివి కూడా కమలనాథుల వైపు నితీష్ మొగ్గుచూపేందుకు కారణాలు కావచ్చని చెబుతున్నారు.
Updated Date - Jan 26 , 2024 | 10:39 PM