ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nora Fatehi: నోరా ఫతేహి డీప్‌ఫేక్ వీడియో.. మరీ ఇంతలా దిగజారాలా?

ABN, Publish Date - Jan 21 , 2024 | 09:45 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి డీప్‌ఫేక్ వీడియోలు ఎక్కువైపోయాయి. ఆ సాంకేతికతను కొందరు ఆకతాయిలు తమ ఎదుగుదల కోసం కాకుండా చెడు పనులకు వినియోగిస్తున్నారు. నటీమణుల్ని టార్గెట్ చేసుకొని.. అభ్యంతరకరమైన వీడియోల్లోనూ, ప్రచార ప్రకటనల్లోనూ వారి ముఖాలను మార్ఫింగ్ చేస్తున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి డీప్‌ఫేక్ వీడియోలు ఎక్కువైపోయాయి. ఆ సాంకేతికతను కొందరు ఆకతాయిలు తమ ఎదుగుదల కోసం కాకుండా చెడు పనులకు వినియోగిస్తున్నారు. నటీమణుల్ని టార్గెట్ చేసుకొని.. అభ్యంతరకరమైన వీడియోల్లోనూ, ప్రచార ప్రకటనల్లోనూ వారి ముఖాలను మార్ఫింగ్ చేస్తున్నారు. నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. ఈ విషయంలో.. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయినా సరే.. ఆకతాయిల్లో మార్పు రావడం లేదు. ఒకదాని తర్వాత మరొక డీప్‌ఫేక్ వీడియోని విడుదల చేస్తూనే ఉన్నారు.


ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటి నోరా ఫతేహిని టార్గెట్ చేశారు. ఒక దుస్తుల కంపెనీకి చెందిన ప్రకటనలో ఆమె ముఖాన్ని ‘ఏఐ’తో మార్ఫ్ చేసి వదిలారు. ఈ వీడియో చూస్తే, అందులో ఉన్నది నోరా ఫతేహినే అని ఎవరైనా భ్రమ పడతారు. ఇది నెట్టింట్లో వైరల్ అవుతూ.. చివరికి నోరా కంటికి చిక్కింది. ఈ వీడియో చూసి ఖంగుతిన్న ఆ నటి.. వెంటనే దాని స్క్రీన్‌షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇది ఫేక్ అని, అందులో ఉన్నది తాను కాదని ఆమె క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించే చర్చలు నడుస్తున్నాయి. ఇది ‘స్కామ్ ఆర్ నాట్ స్కామ్’ అనే డిబేట్‌కి దారి తీసింది. ఆన్‌లైన్ ఆర్థిక మోసాలపై పరిష్కారానికి, అలాగే వాటిపై అవగాహన కల్పించేందుకు ఈ డిబేట్ తెరమీదకి వచ్చింది.

యాదృచ్ఛికం ఏమిటంటే.. రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో కేసులు ప్రధాన నిందితుడు అరెస్టు అయిన రోజే, నోరా ఫతేహి తన డీప్‌ఫేక్ వీడియో పోస్టుని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇంతేకాదండోయ్.. కాజోల్, కృతి సనన్‌తో పాటు ఇంకా ఇతర బాలీవుడ్ నటీమణుల డీప్‌ఫేక్ వీడియోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. చూస్తుంటే.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేదాకా ఈ డీప్‌ఫేక్ తంతు ఆగేలా కనిపించడం లేదు.

Updated Date - Jan 21 , 2024 | 09:45 PM

Advertising
Advertising