ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ram Mandir: వామ్మో.. తొలి రోజునే ఇంత రద్దీనా.. అయోధ్య రామమందిరాన్ని ఎంతమంది సందర్శించారో తెలిస్తే..

ABN, Publish Date - Jan 23 , 2024 | 05:47 PM

అందరి అంచనాలూ నిజం చేస్తూ తొలి రోజున అయోధ్య రామమందిరానికి భక్తులు పోటెత్తారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇప్పటివరకూ సుమారు మూడు లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శనం చేసుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: అంచనాలను నిజం చేస్తూ తొలి రోజునే అయోధ్య రామమందిరానికి భక్తులు పోటెత్తారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఉదయం సమయంలో సుమారు మూడు లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శనం చేసుకున్నారు. అంతే సంఖ్యలో భక్తులు ఆలయం బయట దర్శనం కోసం వేచి చూస్తున్నారు. భక్తులు భారీగా పోటెత్తడంతో అధికారులు రద్దీని నియంత్రించేందుకు ఏకంగా 8 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించాల్సి వచ్చింది. ఈ రోజు దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని కూడా అధికారులు విజ్ఞప్తి చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

తెల్లవారుజాము నుంచే బారులు తీరిన భక్తులు..

నేటి తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు రామాలయానికి క్యూకట్టారని స్థానికులు కొందరు తెలిపారు. అయోధ్య వాసులే కాకుండా, పొరుగు జిల్లాలైన లఖ్‌నవూ, బారాబంకీ, గొండా, బహ్రెయిచ్, ఉన్నావ్, గోరఖ్‌పూర్ నుంచి భక్తులు బాలరాముడి దర్శనం కోసం తరలివచ్చారు. ‘‘ఉదయం ఏడు గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకోగానే భక్తులు పోటెత్తారు. సెక్యూరిటీ సిబ్బంది ఉక్కిరిబిక్కిరయ్యారు’’ అని స్థానికుడు రాకేశ్ పాండే మీడియాకు తెలిపారు.

భక్తుల రద్దీని నియంత్రించేందుకు అయోధ్యలో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ‘‘రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాం. భక్తులు వేచి చూసేందుకు ఓ ప్రాంతం సిద్ధం చేశాం. అక్కడి నుంచి క్రమపద్ధతిలో భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నాం’’ అని అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాళ్ మీడియాకు తెలిపారు. రద్దీ నిర్వహణ కోసం యూపీ స్పెషల్ ఫోర్సెస్‌కు, ఇతర భద్రతా సిబ్బందికీ ప్రత్యేక సూచనలు చేశామని అయోధ్య ఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ‘‘మా బాధ్యత క్రౌడ్ మేనేజ్‌మెంట్ అయినప్పటికీ పోలీసింగ్ విధులు కూడా ఉన్నాయి. అయితే, భక్తులతో కటువుగా ఉండొద్దని సిబ్బందికి సూచనలు ఇచ్చాము. భక్తుల సౌకర్యం కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నాం’’ అని ప్రవీణ్ కుమార్ తెలిపారు.

దర్శన సమయాలు ఇవీ..

శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు ప్రకటన ప్రకారం, భక్తులను ఉదయం 7 నుంచి 11.30 వరకూ దర్శనానికి అనుమతిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ మళ్లీ దర్శనాలను అనుమతిస్తారు. స్వామి వారికి నైవేద్యంగా భక్తులు పళ్లు, పాలను సమర్పించవచ్చని ట్రస్టు పేర్కొంది.

ఆలయ వర్గాలు స్వామి వారికి రోజుకో అలంకరణ చేయనున్నాయి. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపుపచ్చ, శుక్రవారం లేత పసుపుపచ్చ, శనివారం నీల వర్ణం దుస్తుల్లో స్వామివారు దర్శనమిస్తారు. ఇక ప్రత్యేక సందర్భాల్లో కూడా బాలరాముడి అలంకరణలో మార్పులు ఉంటయాని ట్రస్టు వారు తమ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

Updated Date - Jan 23 , 2024 | 05:58 PM

Advertising
Advertising