PM Modi: విద్యార్థులతో ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ నేడు
ABN, Publish Date - Jan 29 , 2024 | 08:39 AM
ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఢిల్లీలో సోమవారం 'పరీక్ష పే చర్చ'(Pariksha Pe Charcha) కార్యక్రమంలో పాల్గొననున్నారు. పరీక్షల సమయం సమీపిస్తున్నందునా విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడేందుకు వారితో ప్రధాని మాట్లాడనున్నారు. విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా పాల్గొంటారు.
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఢిల్లీలో సోమవారం 'పరీక్ష పే చర్చ'(Pariksha Pe Charcha) కార్యక్రమంలో పాల్గొననున్నారు. పరీక్షల సమయం సమీపిస్తున్నందునా విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడేందుకు వారితో ప్రధాని మాట్లాడనున్నారు. విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా పాల్గొంటారు. పరీక్షా పే చర్చా 7వ ఎడిషన్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.
దాదాపు 3వేల మంది స్టూడెంట్స్ ఇందులో పాల్గొననున్నారు. తాను ఈ కార్యక్రమం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. PPC మొదటి మూడు ఎడిషన్లు ఢిల్లీలోని టౌన్-హాల్‌లో ఇంటరాక్టివ్ ఫార్మాట్‌లో జరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా 4వ ఎడిషన్ ఆన్‌లైన్‌లో జరిగింది. పరీక్షా పే చర్చ 5,6వ ఎడిషన్లు ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగాయి.
2023లో దాదాపు 31.24 లక్షల మంది విద్యార్థులు, 5.60 లక్షల మంది ఉపాధ్యాయులు, 1.95 లక్షల మంది తల్లిదండ్రులు పరీక్షా పే చర్చలో పాల్గొన్నారు. ఇవాళ జరగనున్న పీపీసీకి MyGov పోర్టల్‌లో 2.26 కోట్ల రిజిస్ట్రేషన్‌లు నమోదయ్యాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు, కళా ఉత్సవ్ విజేతలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) నుంచి 100 మంది విద్యార్థులు హాజరవుతారు.
లైవ్ ఇక్కడ చూడొచ్చు..
ఈ కార్యక్రమ లైవ్ ప్రధాని కార్యాలయం, విద్యా మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ కూడా లైవ్ అందిస్తోంది. దూరదర్శన్ / PM మోదీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో కూడా వీక్షించవచ్చు.
Updated Date - Jan 29 , 2024 | 08:39 AM