ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi: పుంగనూరు ఆవుల్ని పెంచుకుంటున్న మోదీ.. వాటి విశేషాలివే

ABN, Publish Date - Jan 15 , 2024 | 01:47 PM

మకర సంక్రాంతి సందర్భంగా ఆదివారం ప్రధాని మోదీ(PM Modi) ఆసక్తికర ఫొటోలను షేర్ చేశారు. అందులో ఆయన పుంగనూరు జాతికి చెందిన ఆవులకు మేత తినిపిస్తుండగా.. అవి ఆయన్ని ఆప్యాయంగా హత్తుకోవడం కనిపిస్తోంది. మోదీ నివాసంలోఉన్న పుంగనూరు ఆవుల(Punganuru Cows) విశేషాలు తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు

ఢిల్లీ: మకర సంక్రాంతి సందర్భంగా ఆదివారం ప్రధాని మోదీ(PM Modi) ఆసక్తికర ఫొటోలను షేర్ చేశారు. అందులో ఆయన పుంగనూరు జాతికి చెందిన ఆవులకు మేత తినిపిస్తుండగా.. అవి ఆయన్ని ఆప్యాయంగా హత్తుకోవడం కనిపిస్తోంది. మోదీ నివాసంలోఉన్న పుంగనూరు ఆవుల(Punganuru Cows) విశేషాలు తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ముఖ్యంగా రైతులు వాటి విశేషాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు(Chittoor) జిల్లాలో పుంగనూరు(Punganuru) అనే గ్రామం ఉంది. అక్కడ దొరికేవే ఈ పుంగనూరు రకానికి చెందిన మేలు జాతి ఆవులు.

ఇవి అరుదైనవి. పరిమాణంలో చిన్నగా ఉండే ఇవి మరుగుజ్జు పశువుల జాతుల్లో ఒకటి. వీటిని అపార్ట్మెంట్లలో కూడా పెంచుకోవచ్చు. వీటి పాలల్లో సాధారణ రకం ఆవులకంటే ఎక్కువగా పోషకాలు ఉంటాయని పశు వైద్యులు చెబుతున్నారు. జీకేవీకే యానిమల్ సైన్సెస్ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ బీఎల్ చిదానంద... పుంగనూరు జాతి ఆవులను బంగారు గనులుగా అభివర్ణిస్తున్నారు. “ఈ ఆవు పాలలో బంగారం రసాయన నామమైన Au అనే మూలకం ఉంటుంది. ప్రసిద్ధ తిరుపతితోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనేక దేవాలయాలకు క్షీరాభిషేకం కోసం పుంగనూరు ఆవు పాలను ఉపయోగిస్తారు. ఈ పాలలో అధిక పోషక విలువలు ఉంటాయి.


ఆరోగ్యానికి అవసరమైన ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. పుంగనూరు ఆవు రోజుకు 1-3 లీటర్ల పాలివ్వగలదు. ఇతర దేశీయ జాతి ఆవుల్లో 3 - 4 కొవ్వు శాతం ఉంటే ఈ ఆవుల పాలల్లో 8 శాతం ఉంటుంది” అని చెప్పారు. పుంగనూరు ఆవులు అందంగా కనిపిస్తాయి. వాటి కళ్లు చూడచక్కగా ఉంటాయి. ఆవుల స్నేహపూర్వక స్వభావం ఆకట్టుకుంటుంది.

దీంతో అనేక మంది వీటిని పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీటి జాతి స్వచ్ఛత, ఆవు ఆరోగ్యాన్ని బట్టి ఒక్కో ఆవు ధర రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుందని రైతులు అంటున్నారు. ఒకప్పుడు అంతరించిపోయే దశలో ఉన్న ఈ జాతి ఆవులు మిషన్ పుంగనూరు ప్రాజెక్టు కారణంగా సంతతి పెంచుకున్నాయి. ప్రధాని మోదీ ఆవాసంలో ఉన్న చాలా ఆవులు పుంగనూరు రకానికి చెందినవని ఒకరు తెలిపారు.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Jan 15 , 2024 | 01:47 PM

Advertising
Advertising