PM Modi: రామేశ్వరంలో పవిత్ర స్నానాన్ని ఆచరించిన ప్రధాని మోదీ
ABN, Publish Date - Jan 20 , 2024 | 08:29 PM
ఓ వైపు అయోధ్య రామమందిర(Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు ప్రధాని మోదీ(PM Modi) తమిళనాడు పర్యటన విజయవంతంగా సాగుతోంది. ఆయన శనివారం రామేశ్వరంలోని జలాల్లో పవిత్ర స్నానం ఆచరించారు.
చెన్నై: ఓ వైపు అయోధ్య రామమందిర(Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు ప్రధాని మోదీ(PM Modi) తమిళనాడు పర్యటన విజయవంతంగా సాగుతోంది. ఆయన శనివారం రామేశ్వరంలోని జలాల్లో పవిత్ర స్నానం ఆచరించారు.
అనంతరం పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు పూజారులు సంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలికారు. రామనాథపురం జిల్లాలోని రామేశ్వరం ద్వీపంలో ఉన్న ఈ శివాలయానికి పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడ శివలింగాన్ని శ్రీ రామ చంద్రుడు ప్రతిష్ఠించాడని భక్తులు నమ్ముతారు.
లింగప్రతిష్ఠానంతరం రాముడు, సీతాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారట. అంతకుముందు తిరుచిరాపల్లి(Tiruchirapalli)లోని శ్రీ రంగనాథ స్వామి ఆశీర్వాదానికి ప్రధాని వచ్చారు. అక్కడే ఉన్న ఆండాళ్ అనే గజరాజుకి ఆయన మేత తినిపించారు. అనంతరం గజరాజు ప్రధానిని ఆశీర్వదించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని మోదీకి దేవుడి ఆశీర్వాదం లభించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - Jan 20 , 2024 | 08:30 PM