PM Modi at Dwarkadhish Temple: సముద్ర గర్భంలోని ద్వారకను దర్శించుకున్న ప్రధాని మోదీ
ABN, Publish Date - Feb 25 , 2024 | 03:23 PM
PM Modi at Dwarkadhish Temple: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని(Gujarat) సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకా నగరాన్ని దర్శించుకున్నారు. నీటి అడుగులోకి వెళ్లి.. మునిగిపోయిన ద్వారకా నగరం(Dwaraka) ఉన్న ప్రదేశంలో పూజలు చేశారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi).. గుజరాత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ద్వారకలో నిర్మించిన దేశంలోనే అతి పొడవైన కేబుల్ సపోర్ట్ బ్రిడ్జ్ సుదర్శన్ సేతును ప్రారంభించారు.
PM Modi at Dwarkadhish Temple: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని(Gujarat) సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకా నగరాన్ని దర్శించుకున్నారు. నీటి అడుగులోకి వెళ్లి.. మునిగిపోయిన ద్వారకా నగరం(Dwaraka) ఉన్న ప్రదేశంలో పూజలు చేశారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi).. గుజరాత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ద్వారకలో నిర్మించిన దేశంలోనే అతి పొడవైన కేబుల్ సపోర్ట్ బ్రిడ్జ్ సుదర్శన్ సేతును ప్రారంభించారు. అంతేకాదు.. శ్రీకృష్ణ భగవానుడు పరిపాలించిన నగరంగా పేరొందిన సముగ్రంలో మునిగిపోయిన ద్వారకను సందర్శించారు. డైవింగ్ ఎక్స్‌పర్ట్స్ ఆధ్వర్యంలో డైవింగ్ చేసి సముద్ర గర్భంలోని ద్వారకను సందర్శించారు.
భారతదేశ గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంగా ద్వారకను పేర్కొంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సముద్ర గర్భంలోని ద్వారకకు ప్రధాని మోదీ నెమలి పింఛాలను, పూజా సామాగ్రిని తీసుకెళ్లి పూజలు చేశారు. అంతకు ముందు ప్రధాని మోదీ ద్వారకాధీష్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూర్తి హిందూ సంప్రదాయంలో కాషాయం దుస్తులు ధరించి, మూడు నామాలు పెట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
980 కోట్లతో సుదర్శన సేతు..
ద్వారకకు వచ్చే భక్తులకు ప్రధాని మోదీ భారీ కానుక ఇచ్చారు. ఓఖా ప్రధాన భూభాగాన్ని బెట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే సుదర్శన్ సేతును ఆయన ప్రారంభించారు. సుమారు రూ.980 కోట్లతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి పొడవు 2.32 కిలోమీటర్లు ఉంటుంది. ఇది దేశంలోనే అత్యంత పొడవైనది. ఈ వంతెనను భగవద్గీత శ్లోకాలు, శ్రీ కృష్ణుడి పాత్రతో ప్రత్యేకంగా అలంకరించారు. దీం పాటు, వంతెనపై సోలార్ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇవి ఒక మెగావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Feb 25 , 2024 | 03:23 PM