Anti-Cheating Bill: పోటీ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కి పాల్పడితే.. పదేళ్ల జైలుశిక్ష, రూ.1 కోటి జరిమానా
ABN, Publish Date - Feb 05 , 2024 | 07:53 PM
పోటీ పరీక్షల విషయంలో ఇప్పటివరకూ ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్న ఘటనలు వెలుగు చూశాయి. ఒకరి స్థానంలో మరొకరితో పరీక్షలు రాయించడమో, ముందుగానే పేపర్లు లీక్ చేయడమో వంటిని చాలా జరిగాయి. ఇలాంటి వ్యవహారాల వెనుక కేవలం ఒకరిద్దరి హస్తం మాత్రమే ఉండదు.. పెద్ద మాఫియా గ్యాంగే ఉంటుంది.
పోటీ పరీక్షల విషయంలో ఇప్పటివరకూ ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్న ఘటనలు వెలుగు చూశాయి. ఒకరి స్థానంలో మరొకరితో పరీక్షలు రాయించడమో, ముందుగానే పేపర్లు లీక్ చేయడమో వంటిని చాలా జరిగాయి. ఇలాంటి వ్యవహారాల వెనుక కేవలం ఒకరిద్దరి హస్తం మాత్రమే ఉండదు.. పెద్ద మాఫియా గ్యాంగే ఉంటుంది. ఇలాంటి వాళ్ల వల్లే విద్యార్థుల జీవితాలు రోడ్డున పడుతుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే.. కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒక కొత్త బిల్లుని తీసుకొచ్చింది. మాల్‌ప్రాక్టీస్‌కి పాల్పడే అక్రమార్కులను అడ్డుకోవడం కోసం.. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిన్ మీన్స్) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు.
ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నివారణ) బిల్లు ప్రకారం.. ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై పరీక్ష పత్రాలను లీక్ చేసిన వారికి లేదా జవాబు పత్రాలను తారుమారు చేసిన వారికి మాత్రమే 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1 కోటి జరిమానా విధించబడుతుంది. చిత్తశుద్ధితో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఈ బిల్లు లక్ష్యంగా చేసుకోదని.. అక్రమార్కుల ఆట కట్టించడమే ఈ బిల్లు ఉద్దేశం. మరో విశేషం ఏమిటంటే.. ఈ బిల్లు కింద నేరాలన్ని నాన్-బెయిలబుల్, నాన్-కాంపౌండ్. అంటే.. పోలీసులకు సొంతంగా చర్య తీసుకునే అధికారం ఉంటుంది. వారెంట్ లేకుండానే అనుమానుతుల్ని అరెస్ట్ చేయొచ్చు. నిందితుడికి బెయిల్‌కు అర్హత ఉండదు. అలాగే.. ఆరోపణలు రాజీ ద్వారా పరిష్కరించబడవు. రాజస్థాన్, హరియాణా, గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాలు లీకేజీల కారణంగా పోటీ పరీక్షలు వాయిదా పడిన తరుణంలో.. కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
బిల్లు ముఖ్య లక్ష్యాలేంటి?
* ఈ బిల్లు విద్యార్థులను లక్ష్యంగా చేసుకోదు. వ్యవస్థీకృత గ్యాంగ్‌లు, మాఫియా, మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడే వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ ప్రభుత్వ అధికారులు దోషులుగా తేలితే.. వారిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు.
* కంప్యూటరైజ్డ్ పరీక్షా ప్రక్రియను మరింత సురక్షితంగా మార్చే దిశగా సిఫార్సుల నిమిత్తం ఉన్నత స్థాయి జాతీయ సాంకేతిక కమిటీ ఏర్పాటును ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ కమిటీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఇన్సులేట్ చేయడానికి, ఫూల్ ప్రూఫ్ ఐటి భద్రతా వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, పరీక్షా కేంద్రాలపై ఎలక్ట్రానిక్ నిఘాను నిర్ధారించడానికి, పోటీ పరీక్షల నిర్వహణకు ఐటీ & భౌతిక మౌలిక సదుపాయాల కోసం జాతీయ ప్రమాణాలు & సేవలను రూపొందించేందుకు గాను ప్రోటోకాల్స్‌ని డెవలప్ చేస్తుంది.
* పబ్లిక్ ఎగ్జామినేషన్ సిస్టమ్‌లో పారదర్శకత, విశ్వసనీయతను తీసుకురావడమే ఈ బిల్లు లక్ష్యం. నిజాయితీతో చేసే ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుందని, తమ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని యువతకు భరోసా ఇవ్వడమే దీని ఉద్దేశం.
ఏ పరీక్షలు ఈ కొత్త బిల్లులో కవర్ చేయబడతాయి?
* యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
* స్టాఫ్ సెలక్షన్ కమీషన్
* రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు
* ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్
* నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
Updated Date - Feb 05 , 2024 | 07:53 PM