ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: ప్రియురాలి కోసం అమ్మాయి వేషంలో వెళ్లి.. అడ్డంగా బుక్కైన ప్రియుడు

ABN, Publish Date - Jan 15 , 2024 | 04:24 PM

ప్రేమలో ఉన్న యువతీయువకులు తమ ప్రియమైన వ్యక్తులు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడటాన్ని అప్పుడప్పుడు చూస్తుంటాం. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం, వ్యతిరేక శక్తుల్ని ఎదురించడం, మరేదైనా సరే.. తమకు చేతనైనంత కృషి చేస్తారు.

ప్రేమలో ఉన్న యువతీయువకులు తమ ప్రియమైన వ్యక్తులు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడటాన్ని అప్పుడప్పుడు చూస్తుంటాం. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం, వ్యతిరేక శక్తుల్ని ఎదురించడం, మరేదైనా సరే.. తమకు చేతనైనంత కృషి చేస్తారు. ఇప్పుడు ఓ యువకుడు తన ప్రియురాలి కోసం అమ్మాయి వేషం వేసుకొని మరీ ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లాడు. తన ప్రియురాల్ని ఎలాగైనా పరీక్షల్లో పాస్ చేయించాలన్న ఉద్దేశంతో, ఆ ప్రియుడు ఇలా మారువేషంలో వెళ్లాడు. కానీ.. బయోమెట్రిక్ వద్ద తేడా కొట్టడంతో అతడు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో.. కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన పంజాబ్‌లోకి ఫరీద్‌కోట్‌లో చోటు చేసుకుంది.


ఆ వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని కోట్కాపురాలో ఉన్న DAV పబ్లిక్ స్కూల్‌లో బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ జనవరి 7వ తేదీన ‘మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్’ పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలకు పరమ్‌జిత్ కౌర్ అనే అమ్మాయి దరఖాస్తు చేసుకుంది. అయితే.. ఈ పరీక్షలకు ఆమె పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు. పరీక్షల్లో తాను ఏం రాయలేనని ఆందోళన చెందింది. ఇదే విషయాన్ని తన ప్రియుడు అంగ్రేజ్ సింగ్‌తో పంచుకుంది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? అని కాసేపు ఆలోచించిన అంగ్రేజ్.. ఆమె స్థానంలో అమ్మాయిగా వెళ్లి, పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాడు. పరీక్ష రోజూ తనని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు.. లేడీస్ సూట్, ఎరుపు రంగు గాజులు, బొట్టు, లిప్‌స్టిక్ పెట్టుకొని.. అచ్చం అమ్మాయిలా తయారై వెళ్లాడు. అంతేకాదండోయ్.. తానే పరమ్‌జిత్ కౌర్ అని నమ్మించడానికి నకిలీ ఐడీ కార్డుతో పాటు ఆధార్ కార్డుని కూడా సృష్టించాడు.

అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. బయోమెట్రిక్ వద్దే అసలు సమస్య వచ్చిపడింది. దరఖాస్తు సమయంలో పరమ్‌జిత్ ఇచ్చిన వేలిముద్రలతో అతని ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు. దీంతో అనుమానం వచ్చిన యూనివర్సిటీ సిబ్బంది ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. పరీక్ష రాసేందుకు వచ్చింది అమ్మాయి కాదు, అబ్బాయి అని తెలిసి అందరూ షాక్ అయ్యారు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. పరమ్‌జిత్ కౌర్ అప్లికేషన్‌ని తిరస్కరించారు.

Updated Date - Jan 15 , 2024 | 04:24 PM

Advertising
Advertising