Ayodhya: అయోధ్య రామ మందిర ఆసక్తికర విషయాలు మీకు తెలుసా
ABN, Publish Date - Jan 18 , 2024 | 10:12 PM
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన తేదీ సమీపిస్తున్న కొద్దీ.. రామ జన్మ భూమికి సంబంధించి విశేషాలు తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జనవరి 22న జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా దేశ నలుమూలల నుంచి ప్రముఖులు, సామాన్యులు హాజరుకాబోతున్నారు. దేశంలోని అన్ని నగరాల్లో కార్యక్రమం లైవ్‌లో ప్రదర్శితం కానుంది.
అయోధ్య: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన తేదీ సమీపిస్తున్న కొద్దీ.. రామ జన్మ భూమికి సంబంధించి విశేషాలు తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జనవరి 22న జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా దేశ నలుమూలల నుంచి ప్రముఖులు, సామాన్యులు హాజరుకాబోతున్నారు. దేశంలోని అన్ని నగరాల్లో కార్యక్రమం లైవ్‌లో ప్రదర్శితం కానుంది. అయోధ్యకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం... హిందువుల ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల్లో ఒకటిగా అయోధ్య నిలవనుంది. రాముడి జన్మస్థలంగా, పవిత్ర స్థలంగా అయోధ్యను పరిగణిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న రామమందిరానికి శంకుస్థాపన చేశారు.
ఆలయ వ్యవహారాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ 2.7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఆలయాన్ని పర్యవేక్షిస్తోంది.
రామాలయాన్ని సంప్రదాయ నాగర్ శైలిలో నిర్మించారు. పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. మూడంతుస్థుల్లో నిర్మాణం జరుగుతోంది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనికి 392 స్తంభాలు, 44 తలుపులు, 5 మండపాలున్నాయి. అవి నృత్య, రంగ, సభా, ప్రార్థనా, కీర్తన మండపాలు. భక్తులు సింగ్ ద్వార్ నుంచి 32 మెట్లు ఎక్కి ఆలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ర్యాంపులు, లిఫ్టులు ఉంటాయి. ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇనుము వాడలేదు. పునాదిని 14 మీటర్ల మందపాటి కాంక్రీట్ మిశ్రమంతో వేశారు. నేలలోంచి వచ్చే తేమ నుంచి రక్షణ కోసం, గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాదిని నిర్మించారు. ఆలయ నిర్మాణ ఖర్చు రూ.1,800 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటివరకు రూ.900 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు.
Updated Date - Jan 18 , 2024 | 10:13 PM